ముంబై: బ్యాంకింగ్, ఆయిల్ షేర్లలో కొనుగోళ్ల కారణంగా బెంచ్‌మార్క్ సెన్సెక్స్ మంగళవారం దాదాపు 364 పాయింట్లు లాభపడి 80,369.03 వద్ద స్థిరపడింది. ప్రారంభంలో ఇది 583.69 పాయింట్లు క్షీణించి 79,421.35 వద్దకు చేరుకుంది.
అయితే, తదనంతరం బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఆయిల్ షేర్లలో కొనుగోళ్లు జరగడంతో డే ట్రేడ్‌లో ఇండెక్స్ గరిష్టంగా 80,450.48ని తాకింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 127.70 పాయింట్లు పెరిగి 24,466.85 వద్దకు చేరుకుంది. సానుకూల గ్లోబల్ ట్రెండ్‌లు కూడా కలసి వచ్చాయి.