- దాదాపు 1 శాతం ర్యాలీ
- సెన్సెక్స్ 622 పాయింట్లు అప్
- రూ. 1.17 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
ముంబై : యూఎస్ ఫెడరల్ రిజర్వ్ రేటు తగ్గింపు అంచనాలకుతోడు, టీసీఎస్ ఫలితాలు బాగుండటంతో ఈక్విటీ బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ శుక్రవారం కొత్త జీవితకాల గరిష్టాలను తాకాయి. ఐటీ, టెక్ స్టాక్స్‌లో ర్యాలీ కారణంగా ఒక శాతం వరకు లాభపడ్డాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్‌లలో ర్యాలీ కూడా పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను పెంచింది. 30 షేర్ల బీఎస్‌ఈ సెన్సెక్స్ 622 పాయింట్లు పెరిగి రికార్డు ముగింపు స్థాయి 80,519.34 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఇది 996.17 పాయింట్లు జూమ్ చేసి ఆల్-టైమ్ గరిష్ట స్థాయి 80,893.51ని తాకింది.
ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 186.20 పాయింట్లు పెరిగి రికార్డు ముగింపు గరిష్ట స్థాయి 24,502.15 వద్ద స్థిరపడింది. ఇంట్రా-డేలో ఇది 276.25 పాయింట్లు పెరిగి కొత్త జీవితకాల గరిష్ట స్థాయి 24,592.20కి చేరుకుంది. ఈ వారంలో సెన్సెక్స్ 522.74 పాయింట్లు లేదా 0.65 శాతం ఎగబాకగా, నిఫ్టీ 178.3 పాయింట్లు లేదా 0.73 శాతం పెరిగింది. సెన్సెక్స్ ప్యాక్‌లో టీసీఎస్ దాదాపు 7 శాతం పెరిగింది.
ఇన్ఫోసిస్, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, జెఎస్‌డబ్ల్యు స్టీల్, బజాజ్ ఫైనాన్స్ లార్సెన్ అండ్ టూబ్రో లాభపడ్డాయి. అయితే, మారుతీ, ఏషియన్ పెయింట్స్, టైటాన్, కోటక్ మహీంద్రా బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, ఐసీఐసీఐ బ్యాంకులు వెనుకంజ వేశాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ గేజ్ 0.22 శాతం క్షీణించగా, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.13 శాతం పడింది.
భారీగా పెరిన మార్కెట్ క్యాప్
బీఎస్‌ఈ -లిస్టెడ్ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ కొత్త జీవితకాల గరిష్టస్థాయి రూ.452.38 లక్షల కోట్లకు చేరుకుంది. ఇన్వెస్టర్ల సంపద రూ.1.17 లక్షల కోట్లు పెరిగింది. సూచీల్లో ఐటీ 4.32 శాతం, టెక్ జూమ్ 3.29 శాతం, ఎనర్జీ 0.13 శాతం, బ్యాంకెక్స్ 0.10 శాతం, సేవలు 0.06 శాతం పెరిగాయి. అయితే రియల్టీ, పవర్, మెటల్, యుటిలిటీస్, ఆటో, ఇండస్ట్రియల్స్ కన్స్యూమర్ వెనుకబడి ఉన్నాయి. ఆసియా మార్కెట్లలో షాంఘై, హాంకాంగ్ లాభాల్లో స్థిరపడగా, సియోల్, టోక్యో నష్టాల్లో ముగిశాయి.
మిడ్ సెషన్ ట్రేడింగ్‌లో యూరోపియన్ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. గురువారం అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. గ్లోబల్ ఆయిల్ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 0.78 శాతం పెరిగి 86.13 డాలర్లకు చేరుకుంది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) గురువారం రూ. 1,137.01 కోట్ల విలువైన ఈక్విటీలను అమ్మారు. జూన్‌లో యూఎస్ కోర్ సీఐపీ ద్రవ్యోల్బణం 3 శాతానికి తగ్గింది.