కొత్త గరిష్టాలకు నిఫ్టీ

కొత్త గరిష్టాలకు నిఫ్టీ

ముంబై: బెంచ్‌‌‌‌‌‌‌‌మార్క్ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌లు సెన్సెక్స్‌‌‌‌‌‌‌‌, నిఫ్టీ గురువారం కొత్త గరిష్టాలను టచ్‌‌‌‌‌‌‌‌ చేశాయి. ఇండెక్స్  హెవీవెయిట్ షేర్లు రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌‌‌‌‌‌‌, టాటా మోటార్స్ ర్యాలీ చేయడంతో నిఫ్టీ ఇంట్రాడేలో 25,192.90 దగ్గర ఆల్ టైమ్ గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 100 పాయింట్లు పెరిగి 25,152 దగ్గర సెటిలయ్యింది. సెన్సెక్స్‌‌‌‌‌‌‌‌ కూడా  ఇంట్రాడేలో 82,285.83 దగ్గర ఆల్ టైమ్‌‌‌‌‌‌‌‌ గరిష్టాన్ని టచ్ చేసి, చివరికి 349 పాయింట్ల లాభంతో 82,135 దగ్గర ముగిసింది. 

గత ఎనిమిది సెషన్లలో సెన్సెక్స్‌‌‌‌‌‌‌‌ 1,710 పాయింట్లు (2.12 శాతం) పెరగగా, గత 11 సెషన్లలో నిఫ్టీ 1,013 పాయింట్లు (4.19 శాతం) ర్యాలీ చేసింది. బీఎస్‌‌‌‌‌‌‌‌ఈ స్మాల్‌‌‌‌‌‌‌‌క్యాప్‌‌‌‌‌‌‌‌ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌ గురువారం  0.72 శాతం పెరగగా, మిడ్‌‌‌‌‌‌‌‌క్యాప్ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌ 0.27 శాతం పెరిగింది. సెక్టార్ల పరంగా చూస్తే ఆయిల్ అండ్ గ్యాస్‌‌‌‌‌‌‌‌, ఎనర్జీ, టెలీకమ్యూనికేషన్‌‌‌‌‌‌‌‌ లాభాల్లో ముగిశాయి. ఇండస్ట్రియల్స్‌‌‌‌‌‌‌‌, క్యాపిటల్ గూడ్స్‌‌‌‌‌‌‌‌, కమోడిటీస్‌‌‌‌‌‌‌‌, యుటిలిటీస్‌‌‌‌‌‌‌‌, సర్వీసెస్ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌లు నష్టపోయాయి.  

యూఎస్ జీడీపీ 3 శాతం అప్‌‌‌‌‌‌‌‌..

ఈ ఏడాది జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  యూఎస్ జీడీపీ 3 శాతం (ఏడాది ప్రాతిపదికన) వృద్ధి చెందింది. 2.8 శాతం గ్రోత్ నమోదు చేస్తుందని ఎనలిస్టులు అంచనా వేశారు. మార్చి క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో యూఎస్‌‌‌‌‌‌‌‌ జీడీపీ గ్రోత్ రేట్ 2.8 శాతంగా ఉంది. వినియోగం  ఊపందుకుందని యూఎస్ ప్రభుత్వం ప్రకటించింది.