సెన్సెక్స్​ 197 పాయింట్లు డౌన్.

సెన్సెక్స్​ 197 పాయింట్లు డౌన్.
  • 43 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ​

ముంబై: ఆర్​బీఐ వడ్డీరేట్ల కోత ఈక్విటీ మార్కెట్లపై పెద్దగా ప్రభావం చూపకపోవడం, విదేశీ నిధులు తరలిపోవడం, ప్రాఫిక్ ​బుకింగ్​ ఎక్కువగా ఉండటంతో సెన్సెక్స్ శుక్రవారం​ 197.97 పాయింట్లు నష్టపోయి 77,860.10 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 582.42 పాయింట్ల వరకు పడింది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 43.40 పాయింట్ల నష్టంతో 23,559.95 వద్ద సెటిలయింది. సెన్సెక్స్​లో ఐటీసీ, ఎస్​బీఐ, అదానీ పోర్ట్స్, టీసీఎస్​, ఐసీఐసీఐ బ్యాంక్​, రిలయన్స్, పవర్​గ్రిడ్​ నష్టపోయాయి.

టాటా స్టీల్​, ఎయిర్​టెల్​, జొమాటో, మహీంద్రా అండ్​ మహీంద్రా, అల్ట్రాటెక్​  సిమెంట్​, టెక్​ మహీంద్రా లాభపడ్డాయి. బీఎస్​ఈ స్మాల్​క్యాప్​0.68 శాతం తగ్గగా, బీఎస్​ఈ మిడ్​క్యాప్​ఇండెక్స్​0.13 శాతం పెరిగింది. ఆసియా మార్కెట్లలో సియోల్, టోక్యో నష్టాల్లో షాంఘై, హాంగ్​కాంగ్​లాభాల్లో ముగిశాయి. యూరప్​ మార్కెట్లు నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. అమెరికా మార్కెట్లు గురువారం లాభపడ్డాయి. ఎఫ్​ఐఐలు గురువారం రూ.3,549.95 కోట్ల విలువైన ఈక్విటీలను అమ్మారు.