సెన్సెక్స్ 426 పాయింట్లు పతనం

సెన్సెక్స్ 426 పాయింట్లు పతనం

ముంబై : గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్కెట్లలో బేరిష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బ్యాంకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫైనాన్షియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అమ్మకాల ఒత్తిడితో సెన్సెక్స్, నిఫ్టీ బుధవారం క్షీణించాయి. రెండో క్వార్టర్​ ఫలితాలు నిరుత్సాహపర్చడం,  విదేశీ నిధులు వెళ్లిపోతూనే ఉండటం మార్కెట్ సెంటిమెంట్​ దెబ్బతింది. బీఎస్​ఈ సెన్సెక్స్ 426.85 పాయింట్లు పతనమై 79,942.18 వద్ద స్థిరపడింది. ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈ నిఫ్టీ 126 పాయింట్లు క్షీణించి 24,340.85 వద్దకు చేరుకుంది.

విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐఐలు) మంగళవారం రూ. 548.69 కోట్ల విలువైన షేర్లను అమ్మారు.   బీఎస్​ఈ స్మాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్యాప్ గేజ్ 1.54 శాతం జంప్ చేయగా, మిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్యాప్ ఇండెక్స్ స్వల్పంగా 0.04 శాతం పెరిగింది. సెక్టోరల్ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో కన్స్యూమర్ డ్యూరబుల్స్ 1.21 శాతం, బ్యాంకెక్స్ 1.04 శాతం, టెక్ 0.76 శాతం, ఐటీ  0.67 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 0.62 శాతం, పడిపోయాయి.  ఆసియా మార్కెట్లలో, సియోల్, షాంఘై  హాంకాంగ్ నష్టాలపాలవగా, టోక్యో లాభాలతో ముగిసింది. యూరప్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.