ముంబై: బ్లూ-చిప్, ఐటీ స్టాక్‌లు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లలో అమ్మకాల మధ్య ప్రారంభ ట్రేడ్‌లో బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు తమ ఆల్-టైమ్ గరిష్ట స్థాయిలను తాకినా చివరికి నష్టాల్లో ముగిశాయి. ప్రారంభ ట్రేడ్‌లో 77,000 మార్కును అధిగమించిన తరువాత, 30-షేర్ బీఎస్‌ఈ సెన్సెక్స్ సెషన్ ముగింపులో అమ్మకాల ఒత్తిడికి గురైంది. 203.28 పాయింట్ల నష్టంతో 76,490.08 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 385.68 పాయింట్లు పెరిగి 77,079.04 కొత్త రికార్డును తాకింది. మూడు రోజుల ర్యాలీ తరువాత సోమవారం ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 30.95 పాయింట్లు క్షీణించి 23,259.20 వద్ద స్థిరపడింది.
ఇంట్రా-డేలో ఇది 121.75 పాయింట్లు పెరిగి జీవితకాల గరిష్ట స్థాయి 23,411.90కి చేరుకుంది. 30 సెన్సెక్స్ కంపెనీలలో, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, విప్రో, బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వెనుకబడి ఉన్నాయి. అయితే, అల్ట్రాటెక్ సిమెంట్, పవర్ గ్రిడ్, నెస్లే, ఎన్‌టీపీసీ, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి. బ్రాడ్ మార్కెట్‌లో, బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ గేజ్ 1.04 శాతం మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.56 శాతం పెరిగింది. సూచీలలో ఐటీ, ఆటో, మెటల్, టెక్ రంగాలు వెనుకబడ్డాయి.
ఎఫ్‌ఐఐలు శుక్రవారం రూ.4,391.02 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు. ఆసియా మార్కెట్లలో, టోక్యో గ్రీన్‌లో స్థిరపడగా, సియోల్ నష్టాల్లో ముగిసింది. చైనా, హాంకాంగ్ మార్కెట్లు సెలవుల కోసం మూతపడ్డాయి. యూరప్ మార్కెట్లు ప్రతికూలంగా ట్రేడవుతున్నాయి. శుక్రవారం అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. గ్లోబల్ ఆయిల్ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 0.18 శాతం పెరిగి 79.76 డాలర్లకు చేరుకుంది.