పరుగో పరుగు : సెన్సెక్స్ 84 వేలు.. 4 లక్షల కోట్లు సంపాదించిన ఇన్వెస్టర్లు

పరుగో పరుగు : సెన్సెక్స్ 84 వేలు.. 4 లక్షల కోట్లు సంపాదించిన ఇన్వెస్టర్లు

ఇండియన్ స్టాక్ మర్కెట్స్ లో  బుల్‌ జోరు కంటిన్యూ అవుతోంది. గ్లోబల్ మర్కెట్స్ లో పాజిటివ్ ఇండికేషన్స్ ఉన్న క్రమంలో శుక్రవారం( సెప్టెంబర్ 20, 2024 ) ఉదయం లాభాలాతో ప్రారంభమైన ఇండెక్స్ లు అదే రేంజ్ లో స్పీడ్ ను కంటిన్యూ చేస్తున్నాయి. కాగా.. సెన్సెక్స్ ఆల్ టైం హై మార్క్ ను క్రాస్ చేసింది. సెన్సెక్స్‌ తొలిసారి 84 వేల మార్క్‌ను దాటింది. దీంతో ఇన్వెస్టర్లకు 4 లక్షల కోట్ల రూపాయల లాభాలు వచ్చినట్లు తెలుస్తోంది.

నిఫ్టీ 25,650 మార్క్‌ను తాకగా.. బ్యాంక్‌ నిఫ్టీ కూడా 53,343 మార్క్‌ దగ్గర గరిష్టాన్ని నమోదు చేసింది. ఆటో మెటల్‌ స్టాక్స్‌ దూసుకుపోతుండగా.. ఐటీ స్టాక్స్‌ మాత్రం స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ శుక్రవారం ఉదయానికి 84,053 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ 25,673 పాయింట్ల మార్కును తాకింది.