85 వేల మార్కుకు సెన్సెక్స్​

85 వేల మార్కుకు సెన్సెక్స్​

ముంబై: బెంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్క్ సెన్సెక్స్ 85,000 స్థాయిని అధిగమించింది. నిఫ్టీ మంగళవారం ఫ్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ముగియడానికి ముందు మొదటిసారిగా 26 వేల మార్కును దాటేసింది. ఎఫ్​ఎంసీజీ, బ్యాంకింగ్ షేర్లలో నష్టాల కారణంగా మార్కెట్ ​కొద్దిగా నష్టపోయింది.  30 షేర్ల బీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈ బెంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్క్ 14.57 పాయింట్లు క్షీణించి 84,914.04 వద్ద స్థిరపడింది.  ఉదయం ట్రేడింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సెన్సెక్స్ 85 వేల స్థాయిని దాటింది. ఇది 234.62 పాయింట్లు జంప్ చేసి కొత్త ఆల్-టైమ్ ఇంట్రా-డే గరిష్ట స్థాయి 85,163.23కి చేరుకుంది.

  రికార్డు స్థాయిలో లాభాల స్వీకరణ కారణంగా మధ్యాహ్నం సెషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సూచీ 84,716.07 కనిష్ట స్థాయిని తాకింది.  హిందుస్థాన్ యూనిలీవర్, కోటక్ మహీంద్రా బ్యాంక్  ఐసీఐసీఐ బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో విక్రయాలు సూచీని వెనక్కి లాగాయి.  నిఫ్టీ 1.35 పాయింట్లు లాభపడి తాజా గరిష్ట స్థాయి 25,940.40 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఇది 72.5 పాయింట్లు పెరిగి ఇంట్రా-డే గరిష్ట స్థాయి 26,011.55ను తాకింది.  

ఇదిలా ఉంటే,  ఆర్కేడ్ డెవలపర్స్ లిమిటెడ్ షేర్లు మంగళవారం ఇష్యూ ధర రూ.128తో పోలిస్తే దాదాపు 30 శాతం ప్రీమియంతో ముగిశాయి.  ఈ స్టాక్ బీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈలో ఇష్యూ ధర కంటే 37.42 శాతం పెరిగి రూ.175.90 వద్ద ట్రేడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించింది. రోజులో ఇది 48.43 శాతం పెరిగి రూ.190కి చేరుకుంది. సంస్థ షేర్లు 29.57 శాతం పెరిగి రూ.165.85 వద్ద ముగిశాయి. ఎన్​ఎస్​ఈలో సంస్థ  షేర్లు రూ. 175 వద్ద లిస్టయ్యాయి. ఇవి 36.71 శాతం పెరిగాయి. తర్వాత ఈ షేరు 29.25 శాతం లాభంతో రూ.165.45 వద్ద ముగిసింది.  నార్తర్న్​ ఆర్క్​షేర్లు  కూడా మంగళవారం లిస్టయ్యాయి. ఇవి 23 శాతం లాభపడ్డాయి.