Stock Markes: లాభాల్లో స్టాక్ మార్కెట్లు..ప్రధాన కారణాలివే

Stock Markes: లాభాల్లో స్టాక్ మార్కెట్లు..ప్రధాన కారణాలివే

ఇండియన్ స్టాక్ మార్కెట్ సోమవారం(అక్టోబర్28) ఉదయం లాభాలతో ప్రారంభమై కొనసాగుతున్నాయి. ఉదయం ట్రేడింగ్లో ఆటో, ఐటీ, పీఎస్ యూ బ్యాంక్, ఫార్మా రంగాల్లో కొనుగోళ్లు బాగా పెరిగాయి. దీంతో సెన్సెక్స్ 273.49 పాయింట్లు పెరిగి 79వేల 675 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదే సమయంలో నిఫ్టీ 74.35 పాయింట్లు పెరిగి 24వేల 255 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది.

మార్కెట్ ట్రెండ్ మిశ్రమంగా కొనసాగుతోంది. నేషనల్ స్టాక్ ఎక్ఛ్సేంజ్(NSE)లో1003 స్టాక్ లు గ్రీన్ లో ట్రేడ్ అవుతున్నాయి. 1124 స్టాక్ లు రెడ్ లో ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ బ్యాంక్ 315 పాయింట్లు పెరిగి 51వేల 103 వద్ద ఉంది. నిఫ్టీ మిడ్ క్యాప్ 100, ఇండెక్స్ 107 పాయింట్లు లాభపడి 55వేల 385 వద్ద ట్రేడింగ్ లో ఉంది. అదే సమయంలో నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ 25.65 పాయింట్లు పెరిగి 17వేల 875 వద్ద ట్రేడ్ అవుతోంది. 

Also Read :- బంగారం ధర భారీగా తగ్గడం అంటే ఇది

సెన్సెక్స్ ప్యాక్ లో ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్ బీఐ, ఎన్ టీపీసీ, టాటా మోటార్స్, బజాజ్ పిన్ సర్వ్, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్ , సన్ ఫార్మా టాప్ గెయినర్లుగా ఉన్నాయి. ఇదే సమయంలో ఎల్ అండ్ టీ, ఐటీసీ, టెక్ మహీంద్రా, జేఎష్ డబ్ల్యూ స్టీల్ పవర్ గ్రిడ్, భారతీ ఎయిర్ టెల్ లూజర్లుగా ఉన్నాయి. 

లాభాలకు కారణాలు.. 

గ్లోబల్ క్యూస్.. 

దేశీయ ఈక్విటీలకు సానుకూల సెంటిమెంట్ తో ఆసియా మార్కెట్లు లాభపడ్డాయి. సోమవారం జపాన్ స్టాక్ లు బలమైన ర్యాలీని చవిచూశాయి. ఇతర ఆసియా మార్కెట్లు కూడా లాభపడ్డాయి. 
భారత స్టాక్ మార్కెట్లు ఐదు రోజుల వరుస పతనాల తర్వాత సోమవారం షార్ట్ కవరింగ్ ర్యాలీని ఎదుర్కొంది. నిఫ్టీ 50 గత వారం 2.58 శాతం పడిపోయింది. ఇది వరుసగా నాల్గవ వారం నష్టాలను సూచిస్తుందని విశ్లేషకులు చెపుతున్నారు. 

సెక్టోరల్ ట్రెండ్స్.. 

నిఫ్టీ పీఎస్ యూ బ్యాంక్, నిఫ్టీ మెటల్ , నిఫ్టీ ఆటో,  రియల్టీ ర్యాలీలో ముందంజలో ఉన్నాయి. అన్ని రంగాల సూచీలు సోమవారం గరిష్టంగా లాభాలను నమోదు చేసుకున్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్ , ఐసిఐసిఐ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ లలో చెప్పుకోదగ్గ పెరుగుదలతో బ్యాంకింగ్ స్టాక్స్ లో లాభాలు ఊపందుకున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ రెండో క్వార్టర్ ఫలితాలు మార్కెట్ సెంటిమెంట్ ను మరింత పెంచాయి. ఇది బ్యాంక్ నిఫ్టీని 51వేల 400 పాయింట్లకు పెంచింది. 

క్రూడ్ ఆయిల్

ఇనార్ పై ఇజ్రాయెల్ వారాంతపు కాల్పుల విరమణ చమురు  లేదా అణులక్ష్యాలను అధిగమించి మిడిల్ ఈస్ట్ లో బౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలను తగ్గించిన తర్వాత సోమవారం ముడి చమురు ధరలు 4 శాతం కంటే ఎక్కువ పడిపోయాయి. 

బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ కు 4.31 శాతం క్షీణించి 72.77 డాలర్లకు చేరుకుంది. యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ఫ్యూచర్స్ 4.49 శాతం క్షీణించి 68.56 డాలర్లకు చేరుకుంది. బ్రెంట్, యూఎస్ డబ్ల్యూటీఐ క్రూడ్ ఫ్యూఛర్లు రెండు అక్టోబర్ 1 నుంచి ఓపెన్ లో కనిష్ట స్థాయిలను తాకాయి.