వారాంతంలో ట్రంప్ టారిఫ్స్ రిలీఫ్.. బుల్స్ రంకెలతో సూచీల పరుగులు..

వారాంతంలో ట్రంప్ టారిఫ్స్ రిలీఫ్.. బుల్స్ రంకెలతో సూచీల పరుగులు..
  •  రూ.7.85 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద 
  • సెన్స్‌క్స్ 1310 పాయింట్లు అప్ 
  • నిప్టీ 429 పాయింట్లు ర్యాలీ

ముంబై:  మనదేశంపై విధించబోయే సుంకాలను 90 రో జులపాటు నిలిపివేయనున్నట్టు అమెరికా చేసిన ప్రకటన దేశీయ మార్కెట్లలో జోష్‌ను నింపింది. బెంచ్‌మార్క్ సెన్సెక్స్ శుక్రవారం 1.310 పాయింట్లు పెరగగా, నిఫ్టీ 22,900 స్థాయికి పైన ముగిసింది. బ్యాంకింగ్, చమురు, మెటల్ షేర్లలో ర్యాలీ కనిపించింది. గ్లోబల్ మార్కెట్లలో బేరిష్ ట్రెండ్ ఉన్నప్పటికీ, 30 షేర్ల బీఎస్ఈ సెన్సెక్స్ 1,310,11 పాయింట్లు పెరిగి 75,157,26 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 1,620.18 పాయింట్లు పెరిగి 75, 467.33 వద్దకు చేరుకుంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 429.40 పాయింట్లు పెరిగి 22,828.55 దగ్గర ముగిసింది. 

ఇంట్రాడే ట్రేడింగ్ లో ఈ బెంచ్ మార్క్ 524.75 పాయింట్లు పెరిగి 22.923.90కి చేరుకుంది. దీంతో ఇన్వెస్టర్ల సంపద రూ.7.85 లక్షల కోట్లు పెరిగింది. ఈ సం వత్సరం జూలై 9 వరకు.. అంటే 90 రోజుల పాటు భారతదేశంపై అదనపు సుంకాలను నిలిపివేస్తున్న ట్లు అమెరికా ప్రకటించింది. అమెరికాకు వస్తువుల ను ఎగుమతి చేసే దాదాపు 60 దేశాలపై సార్వత్రిక సుంకాలను విధిస్తున్నట్టు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నెల రెండో తేదీన ప్రకటించారు. భారతదేశం వంటి దేశాలపై అదనపు సుంకాలను విధించారు. మనదేశం నుంచి ఎగుమతి అయ్యే రొయ్యల నుంచి ఉక్కు వరకు చాలా రకాల ఉత్పత్తుల అమ్మకాలపై ఎఫెక్ట్ ఉంటుందని ఎక్స్‌పర్టులు తెలిపారు. 

టాటా స్టీల్ సెన్సెక్స్ షేర్లలో టాప్ గెయినర్ గా నిలిచింది. కంపెనీ తన నెదర్లాండ్స్ స్టీల్ ప్లాంట్లో సామర్థ్యా న్ని, మార్జిన్లను మెరుగుపరచడానికి ఉద్యోగాలను తగ్గిస్తున్నట్టు ప్రకటించిన తర్వాత 4.91 శాతం పెరిగింది. హెచ్ఎఎఫ్సీ బ్యాంక్ 2.33 శాతం పెరిగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎన్టీ పీసీ, అదానీ పోర్ట్స్ లాభపడ్డాయి. నాలుగో క్వార్టర్లో నికర లాభం 1.7 శాతం తగ్గిందని ప్రకటించడంతో టీసీఎస్ షేర్ 0.43 శాతం పడిపోయింది. ఆసియన్ పెయింట్స్ 0.76 శాతం క్షీణించింది. 

అన్నింటికీ లాభాలు.. 

బీఎస్ఈ స్మాల్ క్యాప్ గేజ్ 3.04 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.84 శాతం ర్యాలీ చేసింది. బీఎస్ఈలోని అన్ని రంగాల సూచీలు లాభపడ్డాయి. కమోడిటీలు అత్యధికంగా 3.40 శాతం పెరిగాయి. కన్స్యూమర్ డ్యూరబుల్స్ (2.92 శాతం), యుటిలిటీస్ (2.76 శాతం), పవర్ (2.64 శాతం), ఎనర్జీ (2.51 శాతం), ఇండస్ట్రియల్స్ (2.34 శాతం) కన్స్యూమర్ డిస్క్రిప్ష నరీ 2.25 శాతం పెరిగాయి. బీఎస్ఈలో 3, 115 స్టాక్లు లాభపడగా, 846 క్షీణించాయి. 118 షేర్లు మారలేదు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం ఈక్విటీ మార్కెట్లు పనిచేయవు. చైనా. యూఎస్ మధ్య టాట్-ఫర్-టాట్ టారిఫ్ యుద్ధం కారణంగా పెరుగుతున్న ఆందోళనల మధ్య ప్రపంచ మార్కెట్లు పడ్డాయి. టోక్యో నిక్కీ 225 ఇండెక్స్, దక్షిణ కొరియాలోని కోస్పి నష్టపోగా, షాంఘై ఎస్ఎస్ఈ కాంపోజిట్ ఇండెక్స్. హాంకాంగ్ హాంగ్ సెంగ్ లాభపడ్డాయి.

 టోక్యోలోని నిక్కీ 225 ఇండెక్స్ దాదాపు 3 శాతం పడిపోయింది. యూరోపియన్ మార్కెట్లు నెగటివ్ గా ట్రేడవుతున్నాయి. యుఎస్ మార్కెట్లు గురువారం భారీగా పడ్డాయి. నాస్ డాక్ కాంపోజిట్ 4.31 శాతం, ఎస్ అండ్ పి 500 3.46 శాతం, డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావ రేజ్ 2.50 శాతం పడిపోయాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్ఎ ఐలు) బుధవారం రూ.4,358.02కోట్ల విలువైన ఈక్విటీలను అమ్మారు. మహావీర్ జయంతి సందర్భంగా గురువారం భారత స్టాక్ మార్కెట్లు పనిచేయలేదు