
న్యూఢిల్లీ: స్టాక్‌మార్కెట్లు వరుసగా రెండో రోజైన గురువారం కూడా లాభపడ్డాయి. క్రూడాయిల్‌ధరలు తగ్గుతుండడం, టారిఫ్‌ల విధింపుపై ట్రంప్వెనక్కి తగ్గుతున్నట్టు సంకేతాలు రావడంతో సెన్సెక్స్610 పాయింట్ల లాభంతో 74,340.09 స్థాయికి చేరింది. ఇంట్రాడేలో 660.57 పాయింట్లు దూసుకెళ్లింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 207.40 పాయింట్ల లాభంతో 22,544.70 వద్ద ముగిసింది.
సెన్సెక్స్‌లో ఆసియన్ పెయింట్స్, ఎన్‌టీపీసీ, రిలయన్స్, టాటా స్టీల్, బజాజ్ ఫిన్‌సర్వ్, హెచ్‌యూఎల్, సన్ ఫార్మా, ఏపీ సెజ్, యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్, టైటాన్, బజాజ్ ఫైనాన్స్ లాభపడ్డాయి. టెక్ మహీంద్రా, కోటక్ మహీంద్రా బ్యాంక్, జొమాటో, టాటా మోటార్స్, ఇండస్ఇండ్ బ్యాంక్ వెనకబడి ఉన్నాయి. బీఎస్ఈ స్మాల్‌క్యాప్1.63 శాతం, మిడ్క్యాప్ఇండెక్స్0.65 శాతం పెరిగాయి.
సెక్టోరల్ ఇండెక్స్‌లలో టెలికం, రియల్టీ మాత్రమే నష్టపోయాయి. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్4,53,808.84 కోట్లు పెరిగింది. ఆసియా మార్కెట్లలో టోక్యో, షాంఘై, హాంగ్‌కాంగ్, సియోల్ లాభపడ్డాయి. యూరప్మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. బ్రెంట్‌క్రూడ్ ధర 0.52 శాతం పెరిగి 69.66 డాలర్లకు చేరింది. ఎఫ్ఐఐలు బుధవారం రూ.2,895.04 కోట్ల విలువైన పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు.