రికార్డుస్థాయిలో స్టాక్ సూచీలు.. లాభాల్లో మెజారిటి ఇండెక్స్ లు

రికార్డుస్థాయిలో స్టాక్ సూచీలు.. లాభాల్లో మెజారిటి ఇండెక్స్ లు

ముంబై :  బెంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్క్ సెన్సెక్స్ గురువారం 666 పాయింట్లు ర్యాలీ చేసి తాజా రికార్డు గరిష్ట స్థాయికి చేరుకుంది.  డెరివేటివ్స్ సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నెలవారీ గడువు ముగియడంతో ఇది 0.78 శాతం పెరిగి రికార్డు స్థాయిలో 85,836.12 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని 28 షేర్లు పెరగగా, రెండు తగ్గాయి. ఇంట్రాడేలో ఇది 760.56 పాయింట్లు పెరిగి 85,930.43 ఇంట్రా-డే గరిష్ట స్థాయికి చేరుకుంది. సెన్సెక్స్​ 86 వేల మైలురాయికి కేవలం 69.57 పాయింట్ల దూరంలో ఉంది.  వరుసగా ఆరో రోజు ర్యాలీ చేస్తూ, ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈ నిఫ్టీ 211.90 పాయింట్లు పెరిగి రికార్డు గరిష్ట స్థాయి 26,216.05 వద్ద ముగిసింది. 

ఇంట్రాడేలో ఇది 246.75 పాయింట్లు పెరిగి 26,250.90 తాజా ఇంట్రా-డే జీవితకాల గరిష్ట స్థాయిని తాకింది.  30 సెన్సెక్స్ కంపెనీల నుంచి మారుతి దాదాపు 5 శాతం ఎగబాకింది. టాటా మోటార్స్, బజాజ్ ఫిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సర్వ్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా స్టీల్, జేఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డబ్ల్యూ స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫైనాన్స్,  నెస్లే  లాభపడ్డాయి.  

లార్సెన్ అండ్​ టూబ్రో, ఎన్టీపీసీ వెనుకబడి ఉన్నాయి. చైనా  ఇటీవలి ఆర్థిక సాయం ప్రకటన పెట్టుబడిదారుల విశ్వాసాన్ని బాగా పెంచిందని, ఫలితంగా ప్రపంచ మార్కెట్లలో సానుకూలత కనిపిస్తోందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు.  

మెజారిటీ ఇండెక్స్​లు లాభాల్లో

బీఎస్​ఈ స్మాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్యాప్ గేజ్ 0.39 శాతం క్షీణించగా, మిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్యాప్ ఇండెక్స్ 0.01 శాతం పడిపోయింది.  ఇండెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో ఆటో 2.23 శాతం, మెటల్ 2.08 శాతం, కమోడిటీస్ 1.32 శాతం, ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీజీ  0.84 శాతం, వినియోగదారుల విచక్షణ 0.75 శాతం, సర్వీసెస్ 0.64 శాతం చొప్పున పెరిగాయి.  పరిశ్రమలు, టెలికమ్యూనికేషన్,  యుటిలిటీలు వెనకబడి ఉన్నాయి.  257 స్టాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు 52 వారాల గరిష్ట స్థాయిలను తాకగా, 46 సంస్థలు 52 వారాల కనిష్ట స్థాయికి దిగజారాయి.   సియోల్, టోక్యో, షాంఘై,  హాంకాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో ఎక్స్ఛేంజీలు గణనీయమైన లాభాలతో స్థిరపడ్డాయి.  

యూరోపియన్ మార్కెట్లు సానుకూలంగా ట్రేడవుతున్నాయి. బుధవారం అమెరికా మార్కెట్లు చాలా వరకు నష్టాల్లో ముగిశాయి.   ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐఐలు బుధవారం రూ. 973.94 కోట్ల విలువైన ఈక్విటీలను అమ్మగా, దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు (డీఐఐలు) రూ. 1,778.99 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు.   గ్లోబల్ ఆయిల్ బెంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్క్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 1.80 శాతం క్షీణించి 72.14 డాలర్లకు చేరుకుంది. ఇదిలా ఉంటే అమెరికా జీడీపీ జూన్​ క్వార్టర్​లో మూడుశాతం పెరిగింది.