స్టాక్ మార్కెట్ ఢమాల్.. అలా ఇలా కాదు రక్త కన్నీరు

స్టాక్ మార్కెట్ ఢమాల్.. అలా ఇలా కాదు రక్త కన్నీరు

ఇండియన్ స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. 2024, ఆగస్ట్ 5వ తేదీ ప్రారంభంలోనే ఢమాల్ అంది. సెన్సెక్స్ 15 వందల పాయింట్లు.. నిఫ్టీ 500 పాయింట్లు నష్టపోయింది. 90 శాతం షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సన్ ఫార్మా, బ్రిటానియా, నెస్లీ, ఏషియన్ పెయింట్స్, టీసీఎల్ వంటి అతి కొద్ది షేర్లు మాత్రం గ్రీన్ లో ఉండగా.. మిగతా అన్ని కేటగిరీల్లోని షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

స్టాక్ మార్కెట్ నష్టాలకు కారణం.. అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులే అంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. ఉక్రెయిన్, ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం, ఏషియా, జపాన్ స్టాక్ మార్కెట్లు 7 శాతం వరకు నష్టాల్లో ముగియటం, అమెరికా ఆర్థిక మాంద్యంలోకి వెళుతుందన్న వార్తలు రావటం, అమెరికాలో ఉద్యోగాల నియామకం దారుణంగా తగ్గిపోవటం వంటి కారణాలు ప్రధానంగా ఉన్నాయి. అమెరికాలో గత ఏడాదితో పోల్చితే.. ప్రతినెలా ఉద్యోగాల నియామకం 2 లక్షల 15 వేల నుంచి లక్షా 14 వేలకు పడిపోయింది. అంటే నెలవారీ ఉద్యోగ నియమకాలు లక్ష వరకు తగ్గాయి.. ఈ ప్రభావంతో అమెరికా స్టాక్ మార్కెట్లు సైతం నష్టాల్లో ముగిశాయి.

కొన్ని రోజులుగా ఇండియాలో ప్రత్యక్ష పెట్టుబడులు సైతం తగ్గిపోయాయి. ఈ కారణం వల్ల కూడా మన స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. 

సెన్సెక్స్ 3 శాతం, నిఫ్టీ ఒకటిన్నర శాతం నష్టపోయింది. ఇక సంపద విషయానికి వస్తే లక్షల కోట్ల రూపాయల జనం డబ్బు ఆవిరి అయ్యింది. చాలా షేర్లు 10 నుంచి 20 శాతం వరకు తగ్గాయి. ఇన్వెస్టర్లకు అయితే రక్త కన్నీరే..