సెన్సెక్స్ 148 పాయింట్లు అప్​ .. 73 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ

సెన్సెక్స్ 148 పాయింట్లు అప్​ .. 73 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
ముంబై: వరుసగా మూడో రోజూ స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. ఎఫ్​ఐఐల పెట్టుబడులు పెరగడంతో బీఎస్ఈ సెన్సెక్స్ 148 పాయింట్లు దూసుకెళ్లి 75,449 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 73 పాయింట్లు పెరిగి 22,907 వద్ద ముగిసింది.  సెన్సెక్స్ ప్యాక్​నుంచి టాటా స్టీల్, జొమాటో, పవర్ గ్రిడ్, అల్ట్రాటెక్ సిమెంట్, ఇండస్ఇండ్ బ్యాంక్, లార్సెన్ అండ్​ టూబ్రో, అదానీ పోర్ట్స్, ఎన్టీపీసీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభపడ్డాయి. 

టెక్ మహీంద్రా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఐటీసీ, ఇన్ఫోసిస్, సన్ ఫార్మా, మారుతి, హెచ్‌సీఎల్ టెక్, నెస్లే వెనకబడ్డాయి. బీఎస్ఈ మిడ్​క్యాప్​ 2.28 శాతం, స్మాల్​క్యాప్​ ఇండెక్స్​ 2.17 శాతం పెరిగాయి.