Sensex Rally: సెన్సెక్స్ 1300 పాయింట్లు అప్.. నేడు సెన్సెక్స్-నిఫ్టీ ర్యాలీకి 5 కారణాలివే..

Sensex Rally: సెన్సెక్స్ 1300 పాయింట్లు అప్.. నేడు సెన్సెక్స్-నిఫ్టీ ర్యాలీకి 5 కారణాలివే..

Stock Market Rally: నేడు ఉదయం దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ ఆరంభాన్ని నమోదు చేశాయి. కొన్ని గంటల పాటు స్వల్ప లాభనష్టాల్లో కొనసాగిన బెంచ్ మార్క్ సూచీలు ఒక్కసారిగా తిరిగి పుంజుకోవటం స్టార్ట్ చేశాయి. దీంతో మధ్యాహ్నం 1.25 గంటల సమయంలో సెన్సెక్స్ 1300 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్ కొనసాగిస్తుండగా.. మరో కలీక సూచీ నిఫ్టీ 340 పాయింట్ల లాభంలో ఉంది. అలాగే నిఫ్టీ బ్యాంక్ సూచీ 1200 పాయింట్ల లాభంతో దూసుకుపోతోంది. అయితే మార్కెట్లు ఒక్కసారిగా యూటర్న్ తీసుకుని లాభాల్లోకి రావటానికి కీలక కారణాలను ఇప్పుడు పరిశీలిస్తే..

1. ముందుగా దేశీయ స్టాక్ మార్కెట్ల పురోగమనానికి దారితీసిన అంశం డాలర్ తో రూపాయి మారకపు విలువ పుంజుకోవటమే. ఉదయం ట్రేడింగ్ లో రూపాయి 10 పైసుల లాభపడి రూ.85.54 వద్ద డాలరు మారకపు విలువ చేరింది. దీనికి విదేశీ పెట్టుబడుల వెల్లువ కీలకంగా ఉంది. 

2. ట్రంప్ చైనాపై మినహా ప్రపంచ దేశాలపై టారిఫ్స్ విషయంలో అందించిన రెండు రిలీఫ్స్ ప్రపంచ మార్కెట్లలో అస్థిరతలను అరికట్టింది. ప్రధాన ఆసియా మార్కెట్లతో పాటు జపాన్, హాంకాంగ్, కొరియా మార్కెట్లు లాభాల్లో ఉండటం దేశీయ ఈక్విటీ ఇన్వెస్టర్ల సెంటిమెంట్లను సానుకూలంగా ప్రభావితం చేస్తున్నాయి. 

3. ముఖ్యమైన విషయం ఏమిటంటే అనేక నెలలుగా నికర అమ్మకం దారులుగా ఉన్న విదేశీ మదుపరులు తిరిగి భారత మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు తిరిగి రావటం మార్కెట్లను లాభాల దిశగా నిడిపిస్తోంది. ప్రస్తుతం విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు కేవలం బుధవారం ఒక్కరోజునే రూ.3వేల 936 కోట్ల విలువైన పెట్టుబడులను చేపట్టారని డేటా ప్రకారం వెల్లడైంది. 

4. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రస్తుతం అనేక దేశాలతో ట్రేడ్ డీల్స్ చేసుకుంటున్నారు. ఈక్రమంలోనే భారత ప్రభుత్వం త్వరలోనే చర్చల ద్వారా వాణిజ్య సమస్యలను పరిష్కరించుకుంటుందని ఇన్వెస్టర్లలో కొనసాగుతున్న ఆశాభావం మార్కెట్లలో పెట్టుబడి పెట్టేలా చేస్తోంది. అమెరికా జపాన్, దక్షిణ కొరియా, యూకేతో పాటు ఇండియాను కూడా ముఖ్యమైన వ్యాపార భాగస్వామిగా, మిత్రదేశంగా పరిగణించటం మంచి డీల్ కుదుర్చుకోవటానికి వీలు కల్పిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

5. ప్రస్తుతం మార్కెట్లో మంచి బ్లూ చిప్ స్టాక్స్ కొనుగోలుకు ఎఫ్ఐఐలు, దేశీయ ఇన్వెస్టర్లు ప్రయత్నించటం సూచీలను ముందుకు వడిపిస్తోందని తెలుస్తోంది. ఇది మార్కెట్లలో వేగవంతమైన రికవరీకి దారితీసిందని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఎస్బీఐ, ఎయిర్ టెల్, జొమాటో, ఐసీఐసీఐ బ్యాంక్, సన్ ఫార్మా వంటి షేర్లు పెరుగుదలను చూస్తున్నారు.