ముహూరత్ ట్రేడింగ్ అన్నీ రంగాల్లో లాభాలతో ముగిసింది

ముహూరత్ ట్రేడింగ్ అన్నీ రంగాల్లో లాభాలతో ముగిసింది

దీపావళి సందర్భంగా ప్రతిఏటా ముహూరత్ ట్రేడింగ్ నిర్వహించడం ఆనవాయితీ. నేడు (నవంబర్ 1) జరిగిన ముహూరత్ ట్రేడింగ్ లాభాలతో ముగిసింది.  సాయంత్రం ఏడు గంటలకు బీఎస్ఈ సెన్సెక్స్ 335.06 పాయింట్లతో లాభాలతో క్లోజ్ అయ్యింది. నిఫ్టీ 99 పాయింట్లు బలపడి 24,34.35 వద్ద స్థిరపడ్డాయి. నవంబర్ 1 సాయంత్రం 6 గంటల నుంచి ఒక గంటపాటు జరిగిన మూహూరత్ ట్రేడింగ్. ముహూరత్ ట్రేడింగ్ అనేది హిందూ క్యాలెండర్ సంవత్సరం ప్రారంభాన్ని సూచిస్తోంది. ఈ రోజు ట్రేడింగ్ చేస్తే.. ఏడాది మొత్తం స్టాక్ మార్కెట్లో కలిసివస్తుందని నమ్ముతారు. అందుకే ఈ రోజు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయడానికి ఆసక్తి చూపిస్తారు.

సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు లాభాలు గడించి అన్ని రంగాలు గ్రీన్ లో ట్రేడ్ అయ్యాయి. నిఫ్టీలో మొత్తం 50 షేర్లలో 42 లాభాల్లో, 8 నష్టాల్లో ముగిశాయి. ప్రధానంగా లాభపడిన వాటిలో ఎం అండ్ ఎం, ఓఎన్ జిసి, అదానీ పోర్ట్స్, బెల్, టాటామోటార్స్ లాభపడగా, ప్రధానంగా నష్టపోయిన వాటిలో డాక్టర్ రెడ్డీస్, హెచ్ సిఎల్ టెక్, బ్రిటానియా, టెక్ మహీంద్రా, అదానీఎంటర్ప్రైజెస్ ఉన్నాయి.