లాభాలొచ్చాయ్​ .. సెన్సెక్స్ 759 పాయింట్లు రీబౌండ్

లాభాలొచ్చాయ్​ .. సెన్సెక్స్ 759 పాయింట్లు రీబౌండ్
  • 24,100 పైన ముగిసిన నిఫ్టీ
  • మళ్లీ పెరిగిన అదానీ స్టాక్స్​

ముంబై:  ఫ్రంట్‌‌‌‌‌‌‌‌లైన్ స్టాక్స్ ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్,  రిలయన్స్ ఇండస్ట్రీస్ కొనుగోళ్లతో శుక్రవారం బెంచ్‌‌‌‌‌‌‌‌మార్క్ సెన్సెక్స్ 759 పాయింట్లు ర్యాలీ చేయగా, నిఫ్టీ 24,100 పైన ముగిసింది. సెన్సెక్స్ 0.96 శాతం పెరిగి 79,802.79 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఇది 880.16 పాయింట్లు పెరిగి 79,923.90కి చేరుకుంది.  ఎన్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఈ నిఫ్టీ 216.95 పాయింట్లు పెరిగి 24,131.10 వద్దకు చేరుకుంది. సెన్సెక్స్​లో   పవర్ గ్రిడ్, నెస్లే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇన్ఫోసిస్ మినహా అన్ని స్టాకులూ లాభపడ్డాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ 21.72 శాతం, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 15.56 శాతం పెరగడంతో అదానీ గ్రూప్‌‌‌‌‌‌‌‌లోని మెజారిటీ సంస్థలు లాభాల్లో ముగిశాయి. 

 బీఎస్‌‌‌‌‌‌‌‌ఈ స్మాల్‌‌‌‌‌‌‌‌క్యాప్ గేజ్ 0.76 శాతం, మిడ్‌‌‌‌‌‌‌‌క్యాప్ ఇండెక్స్ 0.31 శాతం పెరిగాయి.   సెక్టోరల్ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌లలో  రియల్టీ మాత్రమే వెనుకబడింది. ఈవారంలో సెన్సెక్స్​685.68 పాయింట్లు (0.86 శాతం), నిఫ్టీ 223.85 పాయింట్లు (0.93 శాతం) పెరిగింది.  ఆసియా మార్కెట్లలో షాంఘై, హాంకాంగ్ లాభాల్లో సియోల్,  టోక్యో నష్టాల్లో ముగిశాయి. యూరప్ మార్కెట్లు దిగువన ట్రేడవుతున్నాయి. 

థాంక్స్ గివింగ్ డే సందర్భంగా గురువారం అమెరికా మార్కెట్లు మూతబడ్డాయి. ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఐలు గురువారం రూ.11,756.25 కోట్ల విలువైన ఈక్విటీలను అమ్మారు. గ్లోబల్ ఆయిల్ బెంచ్‌‌‌‌‌‌‌‌మార్క్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌‌‌‌‌‌‌‌కు 0.30 శాతం తగ్గి 73.06 డాలర్లకు చేరుకుంది.  ఇదిలా ఉంటే మురుగునీటి శుద్ధి సొల్యూషన్స్ ప్రొవైడర్ ఎన్విరో ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రా ఇంజనీర్స్ లిమిటెడ్ షేర్లు శుక్రవారం ఇష్యూ ధర రూ.148తో పోలిస్తే దాదాపు 40 శాతం ప్రీమియంతో ముగిశాయి.