ముంబై: దలాల్‌స్ట్రీట్‌లో గురువారం బుల్స్ రంకెలేశాయి. రెండో రోజూ కొనుగోళ్ల జోరుతో ఇండెక్స్‌లు భారీ లాభాలు సాధించాయి. సెన్సెక్స్ఏకంగా 1,436 పాయింట్లు ర్యాలీ చేసి 9,943.71 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఇది 1,525.26 పాయింట్లు దూసుకెళ్లి 80,032.87 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 445.75 పాయింట్ల లాభంతో 24,188.65 వద్దకు వెళ్లింది. సెన్సెక్స్ ప్యాక్‌లో బజాజ్ ఫిన్సర్వ్ ఎనిమిది శాతం, బజాజ్ ఫైనాన్స్ ఆరుశాతం లాభపడింది. మారుతి, టైటాన్, మహీంద్రా, మహీంద్రా అండ్మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్, జొమాటో, అల్ట్రాటెక్సిమెంట్, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు కూడా బాగా పెరిగాయి. సన్‌ఫార్మా మాత్రమే వెనకబడింది. బీఎస్ఈ మిడ్‌క్యాప్ 0.89 శాతం, స్మాల్‌క్యాప్ 0.68 శాతం పెరిగాయి. అన్ని సెక్టోరల్ ఇండెక్స్‌లు పాజిటివ్‌గా ముగిశాయి. ఆటో ఏకంగా 3.66 శాతం లాభపడింది. వచ్చే వారం నుంచి మొదలయ్యే ఎర్నింగ్స్ సీజన్ గురించి మార్కెట్లో ఆశావాదం కనిపిస్తోందని, ఆటో అమ్మకాలు కూడా ఉత్సాహాన్ని ఇచ్చాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్‌హెడ్ వినోద్ నాయర్ అన్నారు. గత డిసెంబరు జీఎస్టీ వసూళ్లు 1.77 లక్షల కోట్లు దాటడం కూడా బోనస్అయిందని మరికొందరు ఎనలిస్టులు వివరించారు. బీఎస్ఈలో 2,395 స్టాక్స్లాభాల్లో ముగియగా, 1,574 స్టాక్స్నష్టపోయాయి.
రెండు రోజుల్లో రూ.8.52 లక్షల కోట్లు లాభం
రెండు రోజుల మార్కెట్ ర్యాలీ వల్ల ఇన్వెస్టర్ల సంపద రూ.8.52 లక్షల కోట్లు పెరిగింది. బీఎస్ఈ లిస్టెస్సంస్థ మార్కెట్ క్యాప్ రూ.4,50,47,345 కోట్లకు చేరింది. అయితే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్(ఎఫ్ఐఐ) మాత్రం పెట్టుబడులను వెనక్కి తీసుకుంటూనే ఉన్నారు. వీళ్లు బుధవారం రూ.1,782.71 కోట్ల విలువైన ఈక్విటీలను అమ్మేశారు. గ్లోబల్ ఆయిల్ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ ధర 1.09 శాతం పెరిగి బ్యారెల్‌కు 75.47 డాలర్లకు చేరింది. ఆసియాలో సియోల్, షాంఘై, హాంగ్‌కాంగ్ మార్కెట్లు నష్టాలపాలయ్యాయి. యూరప్ మార్కెట్లు నెగటివ్‌గానే ట్రేడవుతున్నాయి. కొత్త సంవత్సరం సెలవు కారణంగా అమెరికా మార్కెట్లు బుధవారం పనిచేయలేదు. సెన్సెక్స్ నూతన సంవత్సరం మొదటిరోజు 368.40 పాయింట్లు పెరిగి 78,507 పాయింట్లకు చేరింది. నిఫ్టీ 98.10 పాయింట్ల లాభంతో 23,742.90 పాయింట్ల వద్ద స్థిరపడింది.