స్టాక్ మార్కెట్ మాంచి ఊపులో ఉంది. ఆల్ టైం రికార్డ్ టచ్ చేసింది. సెన్సెక్స్ 80 వేల పాయింట్లు.. నిఫ్టీ 24 వేల 260 పాయిట్లు టచ్ చేసింది. స్టాక్ మార్కెట్ చరిత్రలో ఇది ఓ రికార్డ్. 2024, జూలై 3వ తేదీ ఉదయం లాభాల్లో ప్రారంభం అయ్యాయి మార్కెట్లు.
బ్యాంకింగ్, ఫైనాన్స్, ఫార్మా, కన్స్యూమర్ గూడ్స్ కంపెనీల షేర్లలో భారీ ర్యాలీ కొనసాగుతుంది. ఐటీ, ఆటోమొబైల్, పెట్రోలియం షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. స్టాక్ మార్కెట్ ఆల్ టైం రికార్డుతో దూసుకెళుతున్నా.. కొన్ని మిడ్ క్యాప్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవటంతో.. చిన్న మదుపర్లు డీలా పడ్డారు.
ఎన్నికల ఫలితాల తర్వాత తగ్గిన స్టాక్ మార్కెట్.. మళ్లీ మోదీ ప్రధాన స్వీకారం, మంత్రి వర్గ విస్తరణ, పార్లమెంట్ సమావేశాలతో బుల్ రన్ నడుస్తుంది. కూటమి ప్రభుత్వం అయినా.. స్థిరంగా ఉంటుందన్న ఉద్దేశంతో.. స్టాక్ మార్కెట్ దూకుడుగా ఉంది.
ఉదయం 80 వేలను టచ్ చేసిన సెన్సెక్స్.. మధ్యాహ్నం 12 గంటల సమయానికి 120 పాయింట్లు తగ్గి.. 79 వేల 882 పాయింట్ల దగ్గర ట్రేడ్ అవుతుంది. అదే విధంగా నిఫ్టీ 24 వేల 258 దగ్గర ట్రేడ్ అవుతుంది.