ఉపఎన్నికల్లో సెంటిమెంట్‌‌‌‌ పన్జేయట్లే..

మొన్న పాలేరు, నారాయణఖేడ్‌‌‌‌..  ఇప్పుడు దుబ్బాక

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో బై ఎలక్షన్స్‌‌‌‌లో సెంటిమెంట్‌‌‌‌ పనిజేయడం లేదు. సిట్టింగ్‌‌‌‌ ఎమ్మెల్యే చనిపోతే సదరు సీటుకు ఆ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు పోటీ చేస్తే ప్రజలు ఆదరించడం లేదు. మొన్న పాలేరు, నారాయణఖేడ్‌‌‌‌… ఇప్పుడు  దుబ్బాకలో ఇదే విషయం తేటతెల్లమైంది. గతంలో సాధారణంగా ఏదైనా అసెంబ్లీ స్థానంలో ఎవరైనా ఎమ్మెల్యే చనిపోతే, ఆ సీటును అన్ని పార్టీలు కలిసి ఏకగ్రీవం చేసేవి. అది కూడా సదరు అభ్యర్థి కుటుంబ సభ్యులకే ఇచ్చేవారు. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత సీన్‌‌‌‌  రివర్సయింది. ఈ ఆనవాయితీకి అధికార టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పార్టీనే ఫుల్​స్టాప్​ పెట్టింది. అట్ల పాలేరు, నారాయణఖేడ్‌‌‌‌ స్థానాల్లో పోటీ చేసి గెలిచింది.

పాలేరు: కాంగ్రెస్‌‌‌‌ నుంచి గెలిచిన పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్ రెడ్డి 2016లో మరణించడంతో అక్కడ బై ఎలక్షన్‌‌‌‌ జరిగింది. వెంకట్‌‌‌‌ రెడ్డి భార్య సుచరితారెడ్డి కాంగ్రెస్​ తరఫున బరిలోకి దిగారు. టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నుంచి తుమ్మల నాగేశ్వర్‌‌‌‌రావు పోటీ చేసి గెలుపొందారు.

నారాయణఖేడ్‌‌‌‌: కాంగ్రెస్‌‌‌‌ ఎమ్మెల్యే పట్లోళ్ల కిష్టారెడ్డి 2016లో చనిపోవడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో కిష్టారెడ్డి కుమారుడు సంజీవరెడ్డి పోటీ చేశారు. టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నుంచి భూపాల్‌‌‌‌ రెడ్డి పోటీ చేసి సంజీవరెడ్డిపై విజయం సాధించారు.

దుబ్బాక: టీఆర్​ఎస్​ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగగా.. ఆ పార్టీ తరఫున ఆయన భార్య సుజాత బరిలోకి దిగారు. బీజేపీ నుంచి పోటీ చేసిన రఘునందన్​రావుకు దుబ్బాక ఓటర్లు పట్టం కట్టారు.

For More News..

సిలబస్​ తగ్గింపుపై అయోమయం!

2021 సెలవుల లిస్ట్ వచ్చేసింది..

గ్రామాల్లో ఇండ్ల మ్యుటేషన్‌కు చార్జీ రూ.800