ఉద్యోగుల విభజన పూర్తయ్యేదెప్పుడు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 50 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి అన్నట్లు సాగుతోంది. కొత్త జోనల్ వ్యవస్థపై ఉత్తర్వులు వచ్చి రెండు నెలలు దాటుతున్నా సర్కారు ఉద్యోగుల కేడర్ స్ట్రెంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఫైనల్ చేయడం లేదు. వివిధ ప్రభుత్వ శాఖల్లోని పోస్టులను కేడర్​ ప్రకారం జిల్లా, జోనల్, మల్టీ జోనల్ వారీగా విభజించడం ప్రారంభించి 47 రోజులు అవుతున్నా పూర్తి స్థాయిలో స్పష్టత రాలేదు. కొత్త జిల్లాల్లో కేడర్ స్ర్టెంత్ మంజూరుపై ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాకపోవడంతో ఈ ప్రక్రియ మరింత ఆలస్యం అవుతున్నట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. ఇప్పుడున్న కేడర్ స్ర్టెంత్ ఫైనల్ చేసిన తర్వాతనే కొత్త జిల్లాలు, జోన్ల ప్రకారం ఉద్యోగుల విభజనకు ఆప్షన్ ఇవ్వనున్నారు. ప్రభుత్వం నాన్చుడు ధోరణి వల్ల ఎక్కడ ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో గుర్తించేందుకు, వాటిని భర్తీ చేసేందుకు మరింత సమయం పడుతోంది.
అంతా ఆన్​లైన్​లోనే.. అయినా ఆలస్యం
ప్రభుత్వ శాఖల్లోని పోస్టుల కేడర్ ప్రకారం జిల్లా పోస్టు, జోనల్, మల్టీ జోనల్ వారీగా ఎక్కడెక్కడ ఎంతమంది ఉద్యోగులు ఉన్నారనే దానిపై సాధారణ పరిపాలన, ఆర్థిక శాఖలు ఆన్​లైన్​లో విభజన ప్రక్రియను ప్రారంభించాయి. డిపార్ట్​మెంట్ వారీగా పోస్టులు, పని చేస్తున్న ఉద్యోగుల వివరాలు వేరు చేస్తున్నాయి. ఈ ప్రక్రియ 15 రోజుల్లో ముగుస్తుందని అప్పట్లో ఆఫీసర్లు చెప్పినా.. నిదానంగా నడుస్తోంది. చివర దశకు చేరుకుందని ఫైనాన్స్ డిపార్ట్​మెంట్ ఆఫీసర్లు చెబుతున్నా.. జీఏడీలో మాత్రం ఉలుకు పలుకు లేదు. అంతా ఆన్​లైన్​లోనే చేస్తున్నా.. ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలతోనే పని మెల్లగా నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఇది పూర్తి చేస్తేనే ఉద్యోగుల విభజనకు తేదీ ఇస్తారు. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు కనీసం 15 రోజుల టైం పట్టే అవకాశం ఉంది. 
ఖళీలు లక్ష దాటే చాన్స్..
కేడర్ స్ర్టెంత్ పూర్తయి, ఉద్యోగుల విభజన చేపడితే ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయనే దానిపై పూర్తి స్పష్టత రానుంది. ప్రభుత్వం 50 వేల డైరెక్ట్ రిక్రూట్​మెంట్ పోస్టులు భర్తీ చేస్తామని చెబుతూ వస్తోంది. అయితే ఖాళీలు లక్ష దాటే అవకాశం ఉందని ఆఫీసర్లు అంటున్నారు. వేకెంట్ పోస్టుల లెక్క తీసినప్పుడు 90 వేల ఖాళీలు ఉన్నట్లు గుర్తించామని, ఇప్పుడు ఆ సంఖ్య మరింత పెరుగుతుందని చెబుతున్నారు. మొత్తం ఖాళీలు ఎన్ని ఉన్నాయో తేలితే.. వాటన్నింటినీ భర్తీ చేయాలనే డిమాండ్ వస్తుందని సర్కార్​ టెన్షన్​పడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే కేడర్ స్ర్టెంత్ నిర్ధారణ ప్రక్రియ, ఉద్యోగుల విభజన ఆలస్యం చేస్తూ వేకెంట్ పోస్టులను తగ్గించి చూపేందుకు ప్రయత్నాలు చేస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఫైనాన్స్ డిపార్ట్​మెంట్ లెక్కల ప్రకారం డైరెక్ట్ రిక్రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్​లో ప్రభుత్వ విభాగాల్లో 2,95,571 శాంక్షన్డ్ కేడర్ స్ట్రెంత్ ఉండగా, ఇన్​స్టిట్యూషన్లలో 52,988 స్ట్రెంత్ ఉంది. మొత్తంగా 3,48,559 డైరెక్ట్ కేడర్ స్ట్రెంత్ ఉంది.