న్యూఢిల్లీ: పంజాబ్ పోలీసుల నుంచి తప్పించుకొని తిరుగుతున్న ఖలిస్తాన్ వేర్పాటువాద నేత అమృత్‌పాల్ సింగ్ ఢిల్లీకి చేరుకున్నట్లు తెలుస్తోంది. సన్యాసి వేషంలో అతను శుక్రవారం ఢిల్లీలోని కాశ్మీర్ గేట్ బస్ టెర్మినల్ వద్ద దిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీ కెమెరాల ఫుటేజీని పంజాబ్, ఢిల్లీ పోలీస్టీమ్స్ పరిశీలిస్తున్నారు. అతను అమృత్సర్ నుంచి హర్యానాలోని కురుక్షేత్రకు.. అక్కడి నుంచి దేశ రాజధానికి బయలుదేరినట్లు ఇప్పటి వరకు లభ్యమైన సీసీ ఫుటేజీ వీడియోల ద్వారా స్పష్టమవుతోందని పోలీసుల వర్గాలు చెప్తున్నాయి. అమృత్‌పాల్ తన వేషం మార్చుకున్నట్లు తెలుస్తున్నది. తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియోలో లెదర్ జాకెట్, బ్లాక్ గాగుల్స్‌తో కనిపించాడు. ఈ వీడియో ఈ నెల 20న అమృత్‌సర్‌లోని ఓ సీసీ కెమెరాలో రికార్డైంది. అక్కడి నుంచి హర్యానాలోని కురుక్షేత్రలో అమృత్, పాపల్‌ప్రీత్ సింగ్‌కు ఆశ్రయం కల్పించిన మహిళ బల్జీత్ కౌర్‌ను శుక్రవారం పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. హత్యాయత్నం, సామరస్యాన్ని దెబ్బతీసే చర్యలు, చట్టం అమలుకు అడ్డంకులు కలిగించడం.. వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న అతను గత శనివారం నుంచి పరారీలో ఉన్నాడు.
సన్యాసి వేషంలో ఢిల్లీకి అమృత్‌పాల్!
- దేశం
- March 26, 2023
లేటెస్ట్
- HMPV: నేషనల్ వైరాలజీ ల్యాబ్‌కు బెంగళూరు చిన్నారుల శాంపిల్స్
- Success: రక్షణరంగ సంస్కరణల ఏడాదిగా 2025
- PawanKalyan: గేమ్ ఛేంజర్ ఈవెంట్ విషాదం.. మృతులకు పవన్ కల్యాణ్ ఆర్థికసాయం
- పంటల బీమా పథకం పొడిగింపు
- ZIM vs AFG: రషీద్ ఖాన్‌కు 11 వికెట్లు.. జింబాబ్వేపై ఆఫ్ఘనిస్తాన్ ఘన విజయం
- Success: పాకిస్తాన్లో భగత్‌సింగ్ గ్యాలరీ
- Success: కాంపిటేటివ్ ఎగ్జామ్ స్పెషల్.. గాంధీ సత్యాగ్రహం
- Good Health: తరచు టెన్షన్ పడుతున్నారా.. లైఫ్ స్టైల్ మారాల్సిందే..!
- వైరస్ వార్తలతో.. స్టాక్ మార్కెట్ ఢమాల్.. 8 లక్షల కోట్ల సంపద ఆవిరి
- త్వరలోనే భారత్ కు బుల్లెట్ రైలు సాకారం అవుతుంది: ప్రధాని మోడీ
Most Read News
- జియో 1234 రూపాయల రీఛార్జ్ ప్లాన్.. ‘ప్లాన్ గడువు ముగిసింది’ అనే గోలే ఉండదు..11 నెలలు ప్రశాంతంగా ఉండొచ్చు..
- హైదరాబాద్‌లో తీరనున్న ట్రాఫిక్ కష్టాలు.. సిటీలో రెండో అతి పెద్ద ఫ్లైఓవర్.. ఇవాళే(జనవరి 6, 2025) ఓపెనింగ్
- చైనా HMPV వైరస్.. ఇండియాలోకి వచ్చేసింది.. బెంగళూరులో ఫస్ట్ కేసు.. చిన్నారిలో లక్షణాలు
- హైదరాబాద్ మెట్రో ట్రైన్‌కు సంబంధించి బిగ్ అప్డేట్.. అటు కూడా మెట్రో..!
- ఇండియాలో HMPV వైరస్ ఒకటి కాదు.. రెండు కేసులు.. ICMR కన్ఫార్మ్ చేసేసింది..
- Good Health: చలికాలంలో ఎక్కువగా తలనొప్పి వస్తోందా.. ఈ టిప్స్ ఫాలో అయితే క్షణాల్లో రిలీఫ్ వస్తుంది..
- హైదరాబాద్ మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీ వాసులకు హైడ్రా బిగ్ అలర్ట్
- పూనమ్ ట్వీట్ పై స్పందించిన 'మా'.... అది లేకుండా చర్యలెలా తీసుకుంటాం..
- తెలంగాణలో మరో కొత్త పథకం.. ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’.. ఏడాదికి రూ.12 వేలు..
- ఇదీ కరోనా లాంటిదే గానీ.. కోవిడ్-19 వైరస్‌కు, HMPV వైరస్‌కు తేడా ఇదే..