
- జిల్లా కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో వేడుకలు
- జాతీయ జెండాల ఆవిష్కరణ
- పాల్గొన్న ప్రభుత్వ విప్లు, కలెక్టర్లు, ఎమ్మెల్యేలు..
ఆదిలాబాద్ నెట్వర్క్, వెలుగు: తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. అధికారులు, నేతలు కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లలో జాతీయ జెండాలు ఎగురవేశారు. నిర్మల్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, కలెక్టర్వరుణ్ రెడ్డి పాల్గొని జెండా ఆవిష్కరించారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ లో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అంతకుముందు విప్, కలెక్టర్ రాహుల్ రాజ్ ,ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి , ఎమ్యెల్యే జోగు రామన్న, అధికారులు, ప్రజాప్రతినిధులు అమర వీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విప్మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తోందన్నారు.
విరాట్ విశ్వకర్మ జయంతి వేడుకలు
మంచిర్యాల జిల్లా కలెక్టర్ భవన సముదాయంలో జరిగిన వేడుకలకు జిల్లాకు చెందిన కలెక్టర్రాహుల్రాజ్, ఎమ్మెల్యేలు, ఆఫీసర్లు హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. తెలంగాణ ప్రాంతానికి సెప్టెంబర్ 17 ఓ ప్రత్యేకమైన రోజు అన్నారు. ఎమ్మెల్యేలు బాల్క సుమన్, దివాకర్ రావు, అడిషనల్ కలెక్టర్ రాహుల్, సబావత్ మోతిలాల్, డీసీపీ సుధీర్ రామ్నాథ్ కేకన్ తదితరులు పాల్గొన్నారు. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో వాస్తు శిల్ప, ప్రతిమశాస్త్ర పితామహుడు విరాట్ విశ్వకర్మ జయంతి వేడుకలను కలెక్టరేట్లో అధికారికంగా నిర్వహించారు.
Also Rard: మూడునాలుగేండ్లలో కోటి 25 లక్షల ఎకరాలకు నీళ్లిస్తం: కేసీఆర్
రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆఫీస్లో కమిషనర్ రెమా రాజేశ్వరి జాతీయ జెండాను ఎగురవేశారు. నేరడిగొండ మండల కేంద్రంలోని శిశుమందిర్ స్కూల్లో, కిష్టాపూర్ గ్రామంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్కూల్ అధ్యక్షుడు రాజేశ్వర్, హెడ్ మాస్టర్ మీనా తదితరులు పాల్గొన్నారు.
ఇది చారిత్రాత్మక రోజు
తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17 ఓ చారిత్రాత్మక రోజు అని ప్రభుత్వ విప్ సుంకరి రాజు అన్నారు. సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన వేడుకలకు కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు, అడిషనల్ కలెక్టర్లు దీపక్ తివారి, దాసరి వేణు, ఎస్పీ సురేశ్ కుమార్, జడ్పీ చైర్మన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి గౌరవ వందనం స్వీకరించారు. మహాత్మా గాంధీ, తెలంగాణ తల్లి ఫోటోలకు పూలమాలలు వేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. విప్సుంకరి రాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోందని, ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి జరిగిందన్నారు.