Hyderabad: వర్షాల ఎఫెక్ట్.. సెప్టెంబర్ 2న పాఠశాలలకు సెలవు

Hyderabad: వర్షాల ఎఫెక్ట్.. సెప్టెంబర్ 2న పాఠశాలలకు సెలవు

హైదరాబాద్ అంతటా ముసురు వాన కురుస్తున్న విషయం తెలిసిందే. పడేది గట్టిగా అన్న పడక గంటకోసారి నాలుగు చినుకులతో పలకరిస్తోంది. అందునా, రాబోయే రెండు రోజులు నగరంలో భారీ వర్షాలు కురస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ముందస్తు చర్యగా హైదరాబాద్‌లోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

ALSO READ | భారీ వర్షాలపై సీఎస్ అలర్ట్: విద్యా సంస్థలకు సెలవులపై కీలక ఆదేశం

రాబోయే రెండు రోజులు హైదరాబాద్ జిల్లా అంతటా భారీ వర్షాలు కురుసే అవకాశం ఉన్నందున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరికైనా సమస్యలు ఎదురైతే హైదరాబాద్ కలెక్టరేట్‌లోని కంట్రోల్ రూమ్‌ 040-23202813, 9063423979, ఆర్డీవో హైదరాబాద్ 7416818610, 9985117660, ఆర్డీవో సికింద్రాబాద్ 8019747481 నెంబర్లకు ఫోన్‌ చేయవచ్చని సూచించారు.