న్యూఢిల్లీ: రూ.రెండు వేల నోటును బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి ఇంకా నాలుగే రోజులు గడువు ఉంది. ఇప్పటికీ దాదాపు రూ. 24,087 కోట్ల విలువైన నోట్లు చెలామణిలో ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఏడాది మే 19న రూ. 2000 నోటును ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించింది.
వాటిని మార్చుకోవడానికి లేదా బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి సెప్టెంబర్ చివరి వరకు గడువు ఇచ్చింది. మొత్తం రూ.3.56 లక్షల కోట్ల విలువైన రూ.రెండు వేల నోట్లలో ఈ నెల ఒకటో తేదీ నాటికి ఏడు శాతం నోట్లు చెలామణిలో ఉన్నాయని ఆర్బీఐ వర్గాలు తెలిపాయి.