గత 14 ఏళ్లలో అత్యధిక ఐపీఓలు ఈ నెలలోనే

గత 14 ఏళ్లలో అత్యధిక ఐపీఓలు ఈ నెలలోనే

ముంబై: మనదేశంలో గత 14 సంవత్సరాలలో ఎన్నడూ లేనన్ని ఐపీఓలు ఈ నెల మార్కెట్​కు వచ్చాయని ఆర్​బీఐ తెలిపింది. సెప్టెంబరులో ఇప్పటి వరకు 28  మెయిన్‌‌బోర్డ్,  ఎస్​ఎంఈ విభాగాలలో ఐపీఓలు దలాల్​స్ట్రీట్​లో అడుగుపెట్టాయని రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన తాజా బులెటిన్‌‌ పేర్కొంది.  దేశీయ మ్యూచువల్ ఫండ్స్‌‌తో సహా చాలా సంస్థలకు చిన్న  మధ్యతరహా ఎంటర్‌‌ప్రైజెస్ (ఎస్​ఎంఈలు) ఇనీషియల్​ పబ్లిక్ ఆఫర్‌‌లపై (ఐపీఓలు) ఆసక్తి పెరుగుతోందని తెలిపింది

ఇన్వెస్టర్లకు కేటాయించిన 54 శాతం ఐపీఓ షేర్లు లిస్టింగ్ అయిన వారంలోపే అమ్ముడయ్యాయని పేర్కొంది.   2024 ప్రథమార్థంలో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో ఐపీఓలు భారత్‌‌ ఖాతాలోనే ఉన్నాయని పేర్కొంది.  ఐపీఓల ద్వారా సేకరించిన మొత్తం ఆదాయంలో భారతదేశం వాటా 9 శాతం ఉందని ఆర్​బీఐ వివరించింది.