వింబుల్డన్‌‌‌‌లో మూడో రౌండ్‌‌‌‌లోకి జొకోవిచ్‌‌‌‌

వింబుల్డన్‌‌‌‌లో మూడో రౌండ్‌‌‌‌లోకి జొకోవిచ్‌‌‌‌

లండన్‌‌‌‌: కెరీర్‌‌‌‌లో 24వ గ్రాండ్‌‌‌‌స్లామ్‌‌‌‌ వేటలో ఉన్న సెర్బియా సూపర్‌‌‌‌ స్టార్‌‌‌‌ నొవాక్‌‌‌‌ జొకోవిచ్‌‌‌‌.. వింబుల్డన్‌‌‌‌లో మూడో రౌండ్‌‌‌‌లోకి అడుగుపెట్టాడు. గురువారం జరిగిన మెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌ రెండో రౌండ్‌‌‌‌లో రెండోసీడ్‌‌‌‌ జొకో 6–3, 6–4, 5–7, 7–5తో జాకబ్‌‌‌‌ ఫియర్నీ (స్కాట్లాండ్‌‌‌‌)పై నెగ్గాడు. మూడు గంటల  మ్యాచ్‌‌‌‌ మొత్తంలో 14 ఏస్‌‌‌‌లు కొట్టిన జొకో మూడు డబుల్‌‌‌‌ ఫాల్ట్స్‌‌‌‌ చేశాడు. 34 విన్నర్స్‌‌‌‌ సాధించగా, 27 అన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌డ్‌‌‌‌ ఎర్రర్స్‌‌‌‌ చేశాడు. 

మరో మ్యాచ్‌‌‌‌లో ఫిల్స్‌‌‌‌ (ఫ్రాన్స్‌‌‌‌) 7–6 (2), 6–4, 2–6, 6–6 (9–8)తో హుర్కాజ్‌‌‌‌ (పోలెండ్‌‌‌‌)ను ఓడించాడు. ఇతర మ్యాచ్‌‌‌‌ల్లో మోన్‌‌‌‌ఫిల్స్‌‌‌‌ (ఫ్రాన్స్‌‌‌‌) 7–6 (5), 6–4, 7–6 (3)తో వావ్రింకా (స్విట్జర్లాండ్‌‌‌‌)పై, మినుయెర్‌‌‌‌ (ఆస్ట్రేలియా) 6–2, 6–2, 7–5తో మునార్‌‌‌‌ (స్పెయిన్‌‌‌‌)పై గెలిచారు. విమెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌లో టాప్‌‌‌‌సీడ్‌‌‌‌ స్వైటెక్‌‌‌‌ (పోలెండ్‌‌‌‌)6–4, 6–3తో మార్టిక్‌‌‌‌ (క్రొయేషియా)పై, జుబెర్‌‌‌‌ (ట్యూనీషియా) 6–1, 7–5తో మాంట్‌‌‌‌గోమెరి (అమెరికా)పై, రిబకినా 6–3, 3–6, 6–3తో పై గెలవగా, వాంగ్‌‌‌‌ (చైనా) 6–4, 6–7 (7), 6–1తో ఐదోసీడ్‌‌‌‌ జెసికా పెగులా (అమెరికా)పై గెలిచారు. ఇక డబుల్స్‌‌‌‌లో యూకీ భాంబ్రీ– అల్బెనో ఒలివెట్టి (ఫ్రాన్స్‌‌‌‌) 6–4, 6–4తో అలెగ్జాండర్‌‌‌‌ బుబిక్‌‌‌‌–అలెగ్జాండర్‌‌‌‌ షెవ్‌‌‌‌చెంకో (కజకిస్తాన్‌‌‌‌)పై గెలిచి రెండో రౌండ్‌‌‌‌లోకి అడుగుపెట్టారు.