ఎంత ముచ్చటగా ఉన్నారు చందు భార్య, పిల్లలు : బంధువులు, మిత్రుల బావోద్వేగం, కన్నీటి పర్యంతం

ఎంత ముచ్చటగా ఉన్నారు చందు భార్య, పిల్లలు : బంధువులు, మిత్రుల బావోద్వేగం, కన్నీటి పర్యంతం

బుల్లితెర ఇండస్ట్రీలో వరస విషాధాలు కలకలం రేపుతున్నాయి. మొన్నటికి మొన్న రోడ్డు ప్రమాదంలో నటి పవిత్ర మరణం తర్వాత.. సహనటి మరణాన్ని జీర్ణించుకోలేక సహజీవనం చేస్తున్న మరో సీరియల్ నటుడు చందు ఆత్మహత్య చేసుకున్నాడు. రెండు కుటుంబాల్లో విషాదం నింపింది ఈ ఘటన. త్రినయిని సీరియల్ లో నటించే నటుడు చందు ఆత్మహత్యతో ఇప్పుడు వారి కుటుంబం వివరాలు బయటకు వచ్చాయి. 

చందుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఓ కుమారుడు, కుమార్తె. ముచ్చటైన ఈ ఫ్యామిలీ ఎంత బాగుందో.. చక్కనైన కుటుంబం.. ముచ్చటగా ఉన్న పిల్లలు.. వాళ్లను చూసి అయినా చందు తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సి ఉండేది.. పెళ్లాం, పిల్లలను వదిలి ఎలా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు అంటూ అందరూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఎంతో ముద్దుగా ఉన్న చందు పిల్లలను చూసి.. ఇంటికి వచ్చిన అందరూ కన్నీటి పర్యంతం అవుతున్నారు. 

 

చందు ఆత్మహత్య వార్త విని ఆయన ఇంటికి పెద్ద సంఖ్యలో సీరియల్ నటులు, అభిమానులు, బంధువులు, మిత్రులు తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే అక్కడ ఉన్న చందు భార్య, పిల్లలను చూసి బావోద్వేగానికి గురవుతున్నారు. ఎంత ముచ్చటగా ఉన్నారు పిల్లలు.. ఇంత అందమైన కుటుంబాన్ని కాదని.. చందు పిచ్చి నిర్ణయం తీసుకున్నాడు.. ఆవేశంలో తీసుకున్న నిర్ణయం వల్ల.. ఇప్పుడు భార్య, పిల్లల పరిస్థితి ఏంటీ అంటూ అందరిలో చర్చనీయాంశం అయ్యింది. 

చక్కనైన కుటుంబం.. ముచ్చటైన పిల్లలు.. సీరియల్ నటుడు భార్య, పిల్లలపై ఇప్పుడు బుల్లితెరలోనే కాదు.. జనంలోనే ఇదే టాక్ నడుస్తుంది.. బావోద్వేగానికి గురి చేస్తుంది.