![సీరియల్ హీరో ముకేశ్ గౌడ ఇంట్లో విషాదం..](https://static.v6velugu.com/uploads/2023/05/Serial-actor-Mukesh-Gowda's-father-passed-away_N0x2S8Pp64.jpg)
సీరియల్ యాక్టర్ ముకేశ్ గౌడ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కొంతకాలంగా పక్షవాతంతో బాధపడుతున్న ముకేశ్ తండ్రి కన్నుమూశారు. తండ్రి మరణవార్త తెలియాగానే షూటింగ్ నుండి స్వగ్రామానికి చేరుకున్నారు ముకేశ్. తండ్రితో తనకున్న జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యాడు. దీంతో ముకేశ్ ఫ్యాన్స్ సంతాపం తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్స్ పెడుతున్నారు.
గతంలో సీరియల్ అవార్డు ఫంక్షన్‌లో తన తండ్రిని ప్రేక్షకులకు పరిచయం చేశారు ముకేశ్. ఆసమయంలోనే ఆయన పక్షవాతంతో కదల్లేని స్థితిలో ఉన్నాడు. ఇక ఇటీవల ఆరోగ్యం విషమించడంతో ఆయన చనిపోయారు. ఇక మోడలింగ్‌తో తన కెరీర్ ప్రారంభించిన ముకేశ్ గౌడ.. 2015లో మిస్టర్ కర్ణాటక టైటిల్ విన్ అయ్యాడు. ఆ తర్వాత కన్నడలో వచ్చిన నాగకన్నిక అనే సీరియల్‌తో ముకేశ్ బుల్లితెర జర్నీ స్టార్ట్ చేశారు. ఆతరువాత ప్రేమ నగర్ సీరియల్‌తో తెలుగు టెలివిజన్ కు పరిచయమై.. గుప్పెంత మనసు సీరియల్‌లో రిషిగా ప్రేక్షకుల మెప్పు పొందాడు. ఈ సీరియల్ లో రిషి క్యారెక్టర్‌లో ముకేశ్ తప్ప ఇంకెవ్వరు సూట్ కారేమో అన్నట్లుగా నటించి పాపులర్ అయ్యారు ముకేశ్.
ఇక రిషి తండ్రిని కోల్పోవడంపై పలువురు బుల్లితెర సెలబ్రెటీ ముకేశ్ కు ధైర్యం చెబుతూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.