జ్యోతి రాయ్ రెండో పెళ్లి చేసుకుందా? హింట్ ఇచ్చేసింది

జ్యోతి రాయ్ రెండో పెళ్లి చేసుకుందా? హింట్ ఇచ్చేసింది

గుప్పెడంత మనసు(Guppedantha manasu) సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్(Jyothi rai) గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల తన హాట్ హాట్ ఫోటో షూట్ తో సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన ఈ జ్యోతి రాయ్.. ప్రస్తుతం రెండో పెళ్లి వార్తలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి కారణం ఆమె ఒక యువ దర్శకుడుతో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియాలో ఖాతాలో షేర్ చేయడమే. ఆ దర్శకుడు మరెవరో కాదు మాట రాని మౌనమిది, శుక్ర సినిమాల డైరెక్టర్‌ సుకు పుర్వాజ్‌(Suku purvaj). అంతేకాదు జ్యోతి రాయ్ ట్విట్టర్ లో తన పేరు జ్యోతి పుర్వాజ్‌(Jyothi Purvaj) గా మార్చుకుంది. దీంతో ఆ అనుమానాలకు బలం చేకూరింది.  

వీరిద్దరూ గత కొంత కాలంగా రిలేషన్షిప్ లో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ట్విట్టర్ లో తన పోరులో పుర్వాజ్‌ పేరును కూడా యాడ్ చేయడంతో ఈ జంట ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చారు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. నిజానికి జ్యోతి రాయ్ కు ఇరవయ్యేళ్ళ వయసులోనే పెళ్లి జరిగింది. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నారు. అయితే చాలా కాలంగా భర్తకు దూరంగా ఉంటూ వస్తోంది జ్యోతి రాయ్. ఈ క్రమంలోనే దర్శకుడు సుకు పుర్వాజ్‌ తో పరిచయం ఏర్పడి అదికాస్తా రిలేషన్షిప్ కు దారితీసింది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై ఇరువైపులా నుండి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు