ఎనిమిది మందిని చంపిన సైకో ప్రవీణ్ అరెస్ట్.. మందు కోసం చంపుతాడంట..

 ఎనిమిది మందిని చంపిన సైకో ప్రవీణ్ అరెస్ట్.. మందు కోసం చంపుతాడంట..

వాడి పేరు ప్రవీణ్.. వీడు ఏం పనులు చేస్తాడో తెలియదు కానీ.. మనుషులను మాత్రం బాగా చంపుతున్నాడు. ఇప్పటి వరకు ఎనిమిది హత్యలు చేసినట్లు ప్రకటించారు రాజేంద్రనగర్ జోనర్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి. 2023, జూన్ 22వ తేదీ మీడియాకు ఈ వివరాలు అందించారు డీసీపీ. మైలార్ దేవర్ పల్లిలో జరిగిన ట్రిపుల్ మర్డర్ కేసులో ప్రధాన నిందితుడు అయిన ప్రవీణ్ ను.. హత్యలు జరిగిన 12 గంటల్లోనే అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు పోలీస్ అధికారి. సీపీ ఫుటేజ్ పరిశీలించిన తర్వాత.. చాలా ఆధారాలు సేకరించిన తర్వాతే.. ప్రవీణ్ హంతకుడు అని నిర్థారించుకుని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారాయన. 

తాగిన మైకంలో.. రోడ్డు పక్కన నిద్రిస్తున్న వాళ్లను టార్గెట్ చేసి చంపుతుంటాడని.. బాగా మందు తాగి బండ రాయిలతో కొట్టి చంపుతాడని చెబుతున్నారు పోలీసులు. ప్రవీణ్ సైకో అని.. గతంలోనూ చాలా హత్యలు చేసినట్లు వివరించారు డీసీపీ ప్రవీణ్. రాజేంద్రనగర్ బుడ్వేల్ దగ్గర ఇటీవల జరిగిన ఓ బిచ్చగాడు హత్య కూడా తానే చేసినట్లు ప్రవీణ్ అంగీకరించినట్లు వెల్లడించారు పోలీస్ ఆఫీసర్. అదే విధంగా నేతాజీనగర్, దుర్గానగర్ చౌరస్తా, కాటేదాన్ లలో జరిగిన మూడు హత్యలు కూడా ప్రవీణ్ చేసినట్లు ఒప్పుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. 

ప్రవీణ్ కు సైకో మనస్తత్వం ఉందని.. రోడ్డు పక్కన నిద్రిస్తున్న వాళ్లను బండరాయితో కొట్టి చంపటం అతని అలవాటుగా చెబుతున్నారు డీసీపీ జగదీశ్వర్ రెడ్డి. 2011లోనే ప్రవీణ్ పై ట్రిపుల్ మర్డర్ కేసు నమోదు అయ్యింది.. అప్పట్లో చంద్రయ్య, గీత అనే ఇద్దరితోపాటు ఓ చిన్నారిని కూడా చంపిన కేసు నమోదైందని.. ఆ తర్వా త రెండు చోరీ కేసులు కూడా ఉన్నాయన్నారు. 2014లో జీవిత ఖైదు పడిందని.. ప్రతి కేసులో శిక్ష పడగా.. పదేళ్లు జైలు శిక్ష అనుభవించిన ఇటీవలే జైలు నుంచి బయటకు వచ్చినట్లు చెప్పారు డీసీపీ. 

మైలార్ దేవర్ పల్లిలోని లక్ష్మీగూడ రాజీవ్ గృహకల్పలో కొన్నాళ్లుగా ప్రవీణ్ నివాసం ఉంటున్నాడని.. ఇప్పటి వరకు ఎనిమిది మందిని హత్య చేసినట్లు వివరించారు రాజేంద్రనగర్ డీసీపీ. మందు కొట్టిన తర్వాత ఏం చేస్తాడో కూడా తెలియని సైకోగా ప్రవర్తిస్తాడని.. కొన్నిసార్లు మద్యం డబ్బుల కోసం.. మరికొన్ని సార్లు చేతబడి చేస్తారని భయంతో కూడా హత్యలు చేశాడని వివరించారు పోలీస్ ఆఫీసర్. ఎట్టకేలకు సైకో ప్రవీణ్​ అరెస్ట్ కావటంతో.. వరస హత్యలకు ఫుల్ స్టాప్ పడినట్లే అనుకుంటున్నారు ప్రజలు. ఏదిఏమైనా ఇలాంటి సైకో మళ్లీ బయటకు రాకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.