రేప్ చేసి చంపుడు… బావిలో పడేసుడు

రేప్ చేసి చంపుడు… బావిలో పడేసుడు

అదో పాడుబడ్డ బావి. ఊళ్లో కి వెళ్లాలంటే బస్టాండ్ దగ్గర దిగి.. నడుచుకుంటూ ఆ బావిని దాటి వెళ్లాల్సిం దే. ఇప్పుడు ఆ బావిలో వరుసగా శవాలు బయటపడుతున్నాయి. ఇటీవల శ్రావణి అనే బాలిక మృతదేహం లభించగా.. తాజాగా మనీష అనే మరో అమ్మాయి మృతదేహం బయటపడింది. నాలుగేళ్ల క్రితం కూడా ఓ బాలిక అదృశ్యమైందని, ఆ బాలికను కూడా చంపేసి ఇదే బావిలో పడేసి ఉంటారని స్థానికు లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నెల క్రితం బావికి సమీపంలోని తోటలో ఓ మహిళపై అత్యాచారం జరిపి హత్య చేశారని చెప్తున్నారు .యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజిపురంలో సీరియల్ మర్డర్స్ తీవ్ర సంచలనం రేకెత్తిస్తున్నాయి. ఈ హత్యలన్నింటి వెనుక శ్రావణి కేసులో అదుపులోకి తీసుకున్న సైకో శ్రీనివాస్ రెడ్డి హస్తం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు .

శ్రావణి కేసును విచారిస్తుండగా…

హాజిపురం గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్ థిని పాముల శ్రావణి(14) ఇటీవల స్పెషల్‍ క్లాసు లకు వెళ్లి ఇంటికి తిరిగొస్తూ కనిపించకుండా పోయింది. మరుసటి రోజు గ్రామ శివారులోని పాడుబడ్డ బావిలో శవమైంది. ఈ కేసు రాష్ట్రవ్యా ప్తంగా సంచలనం రేకెత్తించడంతో రంగంలోకి దిగిన పోలీసులు సిట్ ను ఏర్పాటు చేశారు. అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తిని ఈ నెల 26న సిట్ అదుపులోకి తీసుకొని విచారించింది. అతడిచ్చిన సమాచారం మేరకు శ్రావణి మృతదేహం లభించిన పాడుబడ్డబావిలో సోమవారం మధ్యాహ్నం పోలీసులు తవ్వకాలు జరిపారు. అక్కడ మట్టిని తొలగిస్తుండగా.. ఓ అమ్మాయి మృతదేహం కుళ్లిన స్థితిలో బయటపడింది. అక్కడే ఓ పుస్తకాలబ్యాగు, కాలేజీ ఐడీ కార్డు, ఆధార్ కార్డు, చెప్పులు,చిని గిన షర్డు లభించాయి. ఆ మృతదేహం అదే గ్రామానికి చెందిన త్రిపురనేని మనీష (21)దిగాతేలింది. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి.. ఎముకలుగా మారింది. ఆ ఎముకలను పాలిథీన్‍ కవర్లలో పెట్టి, పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు.

ప్రేమ పెళ్లి చేసుకొని వెళ్లిపోయిందనుకొని..

మనీష తల్లి భారతమ్మ మూడేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయింది. తండ్రి మల్లేశం ఉన్నాడు. వీరికినలుగురు ఆడపిల్లలు. అందులో మనీష చిన్నకూతురు. మల్లేశం కుటుంబం 20 ఏళ్ల క్రితం తుర్కపల్లిమండలం గోపాలపురం నుంచి వలస వచ్చి, ఇక్కడ స్థిరపడింది. మనీష మేడ్చల్‍ జిల్లా కీసరలోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో బీకాం ఫస్టియర్ చదువుతోంది. ఆ

అమ్మాయి మార్చి 6న అదృశ్యమైంది. ప్రేమ పెళ్లి చేసుకొని ఎక్కడికో వెళ్లిపోయిందనుకున్న కుటుంబసభ్యు లు పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేదు. సోమవారం పాడుబడ్డ బావిలో మనీష మృతదేహంతో పాటు ఆమెకు సంబంధించిన ఐడీ కార్డు , చెప్పులు దొరకడంతో కుటుంబసభ్యు లు గుండెలవిసేలా రోదించారు.

కల్పన ఏమైంది?

బొమ్మలరామారం మండలం మైసి రెడ్డిపల్లి గ్రామానికి చెందిన తుంగని నందం, భాగ్యమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. చిన్నకూతురు కల్పన(11) నాలుగేళ్ల క్రితం అదృశ్యమైంది. బొమ్మలరామారంలోని జెడ్పీ హైస్కూల్లో 6వ తరగతి చదువుతుండేది. వేసవి సెలవుల్లో మేనత్త ఊరైన హాజిపురానికి వచ్చింది. 2015, ఏప్రిల్‍ 22న కాలినడకన స్వగ్రామమైన

మైసి రెడ్డిపల్లికి వస్తూ అదృశ్యమైంది. ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో, అప్పట్లోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతవరకు పోలీసులు ఆ బాలిక ఆచూకీని కనుగొనలేకపోయారు. కల్పన కూడా శ్రావణి, మనీషను పాతిపెట్టిన పాడుబడ్డ బావి దారి వెంటే నడుకుంటూ వెళ్లి కనిపించకుండా పోయింది. దీంతో కల్పనను కూడా ఇలాగే చిదిమేసి ఉంటారనిస్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

తోటలో మహిళపై ఘాతుకం…..

శ్రావణి దారుణ హత్య కంటే ముందు నెలన్నర క్రితం పాడుబడ్డ బావికి సమీపంలోని తోటలో ఓ మహిళను రేప్‍ చేసి చంపేశారు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన దంపతులు ఇక్కడికి పొట్టకూటి కోసం వచ్చి ఓ తోటలో పనిచేసేవారు. సదరు మహిళను దుండగులుఅత్యా చారం చేసి, ఆపై చంపేశారని గ్రామస్థులు చెప్తున్నారు. ఈ విషయం బయటకు రాకుండా కొందరు ప్రయత్నించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

హాజిపురంలో పోలీస్‍ పహారా...

హాజిపురం గ్రామంలో నాలుగు రోజుల వ్యవధిలో పాబడ్డ ఒకే బావిలో ఇద్దరు అమ్మాయి ల మృతదేహాలు బయటపడడంతో టెన్షన్​ నెలకొంది. నిందితులను అరెస్టు చేసి శిక్షించాలని గ్రామస్థులు డిమాం డ్ చేస్తున్నారు. దీంతో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా గ్రామంలో పోలీసులు పహారా ఏర్పాటు చేశారు. శ్రావణి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన రోజే పెద్ద ఎత్తు న ఆందోళనలు నిర్వహించారు. రాచకొండ పోలీస్‍ కమిషనర్‍ మహేష్ భగవత్ తోనూ ఈ విషయం చెప్పారు. విచారణ జరుపుతామని, 24గంటల్లో నిం దితులను పట్టుకుం టామని సీపీ హామీ ఇచ్చారు