బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బండి లొల్లి

బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బండి లొల్లి
  • కొందరు బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీడర్లు కేంద్రమంత్రిని కలవడంపై రాజకీయ రచ్చ
  •  ఇటీవల సంజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సునీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్పొరేటర్ల సన్మానం 
  •  స్మార్ట్ సిటీ నిధులు సంజయ్ వల్లే వచ్చాయని ప్రశంసలు
  •  మేయర్ కామెంట్స్ ను తప్పుబట్టిన మాజీ మేయర్ రవీందర్ సింగ్, బీఆర్ఎస్ లీడర్ చల్లా హరిశంకర్

కరీంనగర్, వెలుగు: కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరుగుతున్న వరుస పరిణామాలు జిల్లాలో హాట్​టాపిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారాయి. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సెంట్రల్ మినిస్టర్ గా బాధ్యతలు చేపట్టాక మేయర్ సునీల్ రావు, బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆయనకు సన్మానం చేయడం గులాబీ పార్టీలో చిచ్చురేపింది. 

లోక్ సభ ఎన్నికల వరకు ఉప్పునిప్పులా వ్యవహరించిన నాయకులే ఇప్పుడు అభినందనలు తెలపడం, ప్రశంసించడంతో  సొంత పార్టీలో రాజకీయ దుమారానికి దారితీసింది.. ఒకప్పటి కార్పొరేటర్ ఇప్పుడు కేంద్ర మంత్రి అయినందుకే కలిసి అభినందించామని, ఇందులో రాజకీయాల్లేవని మేయర్, కార్పొరేటర్లు సమర్థించుకుంటున్నప్పటికీ.. కొందరు బీఆర్ఎస్ నేతలు మాత్రం వారి కామెంట్స్ కు పరోక్షంగా కౌంటర్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. 

అప్పుడు పైసా తేలేదని విమర్శలు.. 

ఎంపీగా బండి సంజయ్ కరీంనగర్​కు పైసా తేలేదని, స్మార్ట్ సిటీ తెచ్చిన ఘనత మాజీ ఎంపీ వినోద్ కుమార్, అప్పటి మంత్రి గంగుల కమలాకర్ దేనని అసెంబ్లీ, లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల టైంలో ప్రచారాలు, ప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మీట్లు పెట్టి మరీ మేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గొంతెత్తారు. కానీ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడం, మరోవైపు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి బండి సంజయ్  మంత్రి కావడంతో కరీంనగర్ రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. 

బండి సంజయ్ కి కంగ్రాట్స్ చెప్తూ  బీఆర్ఎస్ నేత, మేయర్ సునీల్ రావు వాట్సప్ స్టేటస్ పెట్టుకోవడంతోపాటు మంత్రిగా తొలిసారి కరీంనగర్​కు చేరుకున్న ఆయనను కలిసి బొకే ఇచ్చి శాలువాతో సన్మానం చేశారు. మరుసటి రోజు బీఆర్ఎస్ కార్పొరేటర్లు గంధం మహేశ్, ఐలేందర్ యాదవ్, ఎడ్ల అశోక్, కచ్చు రవి తదితరులు సైతం కేంద్రమంత్రిని కలిశారు. 

అంతకుముందు మేయర్ మీడియాతో మాట్లాడుతూ స్మార్ట్ సిటీ ఫండ్స్ ఎప్పటికప్పుడు రిలీజ్ చేయించడంలో సంజయ్ ఎంతగానో సహకరించారని వెల్లడించారు. ఈ కామెంట్స్ ఇప్పుడు బీఆర్ఎస్ లో హాట్ టాపిక్​గా మారాయి. కరీంనగర్ బీఆర్ఎస్ లీడర్లు ఒక్కొక్కరుగా ప్రెస్ మీట్స్ పెడుతూ మేయర్ కు కౌంటర్ ఇస్తున్నారు. అయితే భవిష్యత్ లో  కాంగ్రెస్ లో చేరిన కార్పొరేటర్లు తనపై అవిశ్వాసం పెడితే.. తాను అవిశ్వాసం నుంచి గట్టెక్కడానికి బీజేపీ కార్పొరేటర్ల సాయం తీసుకునేందుకే బండి సంజయ్ ని మేయర్ ప్రసన్నం చేసుకుంటున్నారనే టాక్  కూడా నడుస్తోంది.   

మేయర్ కామెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు గులాబీ లీడర్ల కౌంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

స్మార్ట్ సిటీ నిధులు రిలీజ్ చేయించేందుకు సంజయ్ సహకరించారని మేయర్ సునీల్ ప్రకటిస్తే.. అసలు స్మార్ట్ సిటీ ప్రాజెక్టుతో ఏ లీడర్ కు భాగస్వామ్యం లేదని కేవలం అప్పటి సీఎం కేసీఆర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ మంత్రి గంగుల కమలాకర్ వల్లే వచ్చాయని డిప్యూటీ మేయర్ స్వరూపారాణి భర్త, బీఆర్ఎస్ కరీంనగర్ సిటీ ప్రెసిడెంట్ చల్లా హరిశంకర్ శనివారం మీడియా ఎదుట స్పష్టం చేశారు. 

ఇది కేవలం మేయర్ సునీల్ రావుకు కౌంటర్ ఇచ్చేందుకు హరిశంకర్ ఇలా మాట్లాడారనే చర్చ నడుస్తోంది. మాజీ మేయర్ రవీందర్ సింగ్ కూడా కరీంనగర్ లో మీడియాతో మాట్లాడుతూ స్మార్ట్ సిటీ అభివృద్ధిలో బండి సంజయ్ పాత్ర లేదని, కరీంనగర్ కు స్మార్ట్ సిటీ హోదా, నిధులు మాజీ ఎంపీ వినోద్ కుమార్ వల్లే వచ్చాయని ప్రకటించారు. ఇది కూడా సునీల్ రావు కామెంట్స్ కు కౌంటర్ అని తెలుస్తోంది. ఐదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ ను టార్గెట్ చేసుకుని దుమ్మెత్తి పోసిన బండి సంజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని మేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రశంసిస్తుండడంతో.. బీఆర్ఎస్ పెద్దలే ఆ పార్టీ నేతలతో ఇలా ప్రెస్ మీట్లు పెట్టి కౌంటర్లు ఇప్పిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. 

కన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్యూజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కేడర్.. 

కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తాజాగా జరుగుతున్న పరిణామాలతోపాటు కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేరుతారన్న ప్రచారంతో బీఆర్ఎస్​ శ్రేణుల్లో కన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్యూజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెలకొంది. మరో ఏడు నెలల్లో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కు, మిగతా స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో ఏ పార్టీలో చేరితే  ప్రాధాన్యముంటుందని, కార్పొరేటర్, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ లాంటి టికెట్లు  దక్కుతాయని లెక్కల్లో సెకండరీ లీడర్లు ఉన్నట్లు సమాచారం. లోకల్ బాడీ ఎన్నికలు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా మారే అవకాశం ఉండడంతో కారు దిగేందుకు అనేక మంది కింది స్థాయి లీడర్లు ప్లాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకుంటున్నట్లు తెలిసింది.