గురుకులాల్లో వరుస ఘటనలు ఆపలేరా

గురుకులాల్లో వరుస ఘటనలు ఆపలేరా

‘విద్య  వివేకాన్ని,  విమర్శనా శక్తిని,  విచక్షణా జ్ఞానాన్ని అందించాలి’ అన్నారు  ప్రముఖ  రాజనీతి తత్వవేత్త  సోక్రటీసు.  ఏ దేశం అభివృద్ధి  చెందాలన్నా  అక్కడి విద్యా విధానమే అత్యంత కీలకం.  విద్యా వ్యవస్థకు పునాది వంటిది పాఠశాల విద్య.   దేశంలో   వేల  సంవత్సరాలుగా విద్యకు నోచుకోని  ఎస్సీ, ఎస్టీ, బీసీ,  మైనార్టీ వర్గాల  విద్యార్థులకు  మౌలిక సదుపాయాలతో  కూడిన  నాణ్యమైన  ఉచిత విద్య,  భోజనం,  వసతి  కల్పించేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చొరవ  తీసుకున్నారు.

పేదల సంక్షేమమే  ధ్యేయంగా  పనిచేసిన  మాజీ  ఐఏఎస్ అధికారి ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  శంకరన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల  దార్శనికతతో  1984లో   ఏర్పాటు చేసిన విద్యా కేంద్రాలే  సాంఘిక  సంక్షేమ  గురుకుల  విద్యాలయాలు.  సామాజికంగా, ఆర్థికంగా  వెనుకబడిన  విద్యార్థుల  అభ్యున్నతి కోసం  కాలానుగుణంగా  ప్రభుత్వం  ఎస్సీ, ఎస్టీ,  బీసీ,  మైనార్టీ సంక్షేమ గురుకుల విద్యాలయాలను నెలకొల్పింది. 

రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 269 ఎస్సీ, 183 ఎస్టీ,  29 గిరిజన ఆశ్రమ  గురుకులాలు,  327 మహాత్మ జ్యోతిబాఫూలే  బీసీ, 204 మైనారిటీ సంక్షేమ గురుకులాలతోపాటు  37 జనరల్ గురుకులాలు ఉన్నాయి. ఈ  గురుకుల విద్యాసంస్థల్లో  చదువుతున్న  లక్షలాదిమంది  విద్యార్థుల్లో  నూటికి 90 శాతంమంది ఎస్సీ, ఎస్టీ,  బీసీ, మైనారిటీ  వర్గాలకు చెందిన పేద విద్యార్థులే! 

రా  ష్ట్రంలోని  అన్ని గురుకులాలు, వసతి గృహాల్లో,  ప్రభుత్వ పాఠశాలల్లో  విద్యార్థులకు నాసిరకం భోజనం పెట్టినా,  నాణ్యతలేని  సరుకులు  సరఫరా చేసినా..  ప్రభుత్వ అధికారులు,  కాంట్రాక్టర్లు జైలు ఊచలు  లెక్కపెట్టాల్సిందేనని బాలల దినోత్సవం నాడు ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి అధికారులను  ఘాటుగా హెచ్చరించారు. ఈ హెచ్చరిక వెలువడిన పది రోజుల వ్యవధిలోనే  కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థి శ్రావ్య కలుషిత ఆహారం తిని, తీవ్ర అస్వస్థతతో  25 రోజులు మృత్యువుతో  పోరాడి మరణించడం అత్యంత దురదృష్టకరం. 

గురుకులాల్లో వరుస సంఘటనలు

నిత్యం ఏదో ఒక గురుకులంలో కలుషిత ఆహారంతో  కొందరు, అనారోగ్యంతో ఇంకొందరు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు.  పాముకాటుకుగురై, ప్రమాదవశాత్తు మరికొందరు విద్యార్థులు మరణిస్తున్నారు. విద్యార్థుల  మరణాలు  తల్లిదండ్రులకు తీరని కడుపు కోతను  మిగుల్చుతున్నాయి. ఏ గురుకులంలో,  ఏ ప్రభుత్వ పాఠశాలలో ఎప్పుడు ఎవరికి ఏమవుతుందోననే భయంతో విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. 

రాష్ట్ర వ్యాప్తంగా ఏడాది కాలంలో పలు కారణాలతో  దాదాపు 48 మంది విద్యార్థులు మరణించినట్లు గణాంకాలు చెబుతున్నాయి.  వీరిలో 23 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోగా,  మరో 8 మంది విద్యార్థులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మరో 13 మంది విద్యార్థులు అనారోగ్యంతో మృతి చెందారు. మరోపక్క నారాయణపేట జిల్లా మాగనూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం కలుషితాహారం తిని 29 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురికావడం కలకలం రేపింది.  గత వారం ఇదే పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని 50 మంది అస్వస్థతకు గురైన ఘటన తెలిసిందే! 

గతమెంతో ఘనం...నేడు వివాదాల మయం 

గతమెంతో ఘనం,  భవిష్యత్తు శూన్యం అన్న చందంగా తయారైంది గురుకులాల పరిస్థితి.  ఎంతోమంది  పేద విద్యార్థుల  భవిష్యత్తు తీర్చిదిద్దిన గురుకులాల భవిష్యత్తు  నేడు  ప్రశ్నార్థకంగా మారింది.  గడిచిన 40 ఏండ్లలో  సంక్షేమ గురుకులాల  ఔన్నత్యాన్ని  పెంచేలా  పాలక ప్రభుత్వాలు  ఎంతోమంది  ఐఏఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,  ఐపీఎస్,  ఐఎఫ్ఓఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధికారులను కార్యదర్శులుగా నియమించింది.  ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, అధికారుల వినూత్న ఆలోచనలకు అనుగుణంగా ఈ విద్యాసంస్థలు నడపడం వల్ల అవి పేద విద్యార్థుల భవితకు బంగారుబాటలు వేశాయి.

ఐఏఎస్ అధికారి ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శంకరన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తర్వాత, ఎస్సీ సంక్షేమ గురుకుల కార్యదర్శిగా పనిచేసిన మాజీ ఐఏఎస్ అధికారి డిఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గార్గ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  గురుకులంలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి అభివృద్ధి చేశారు.  మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్  ప్రవీణ్ కుమార్  గురుకుల విద్యాలయాలను  ప్రపంచస్థాయికి తీసుకెళ్లేలా ప్రత్యేక కరికులం ప్రవేశపెట్టి, అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేలా కృషి చేశారు. ఇంతటి ప్రఖ్యాతిగాంచిన గురుకులాలు అధికారుల మధ్య సమన్వయ లోపంతో ఇప్పుడు అనేక సమస్యలతో  కునారిల్లుతున్నాయి. 

అద్దె భవనాల్లో  గురుకులాలు

గత కేసీఆర్ ప్రభుత్వం కులాలవారీగా, మత మైనారిటీలకు ప్రత్యేకంగా గురుకులాలు ఏర్పాటు చేసిందే తప్ప గురుకులాలకు సరిపడా భూమి కేటాయించలేదు.  పక్కా భవనాల  నిర్మాణానికి  బడ్జెట్ కేటాయించినా  నిధులు విడుదల చేయడంలో పూర్తిగా విఫలమైంది.  అద్దె భవనాల్లో  నడిచే అన్ని గురుకుల పాఠశాలలు,  జూనియర్,  డిగ్రీ,  లా డిగ్రీ,  అగ్రికల్చర్   డిగ్రీ  కళాశాలలో  విద్యార్థులకు అవసరమైనన్ని తరగతి గదులు లేవు. 

వసతి గృహాల్లో  కనీస మౌలిక వసతులు లేవు.  ఇప్పటికీ 80 శాతం గురుకులాలు  అద్దె భవనాల్లో  కొన సాగుతున్నాయి. చాలా గురుకులాల్లో ఆహార పట్టిక సక్రమంగా అమలు జరగడంలేదు.  వంటగదులు లేవు,  డైనింగ్ హాల్స్ అసలే లేవు.  చెట్ల కింద, ఆరుబయట వరండాలోనే  వంట చేస్తున్నారు, విద్యార్థులు కూడా  ఆరుబయటే  అల్పాహారం,  లంచ్,  డిన్నర్  తింటున్నారు. రక్షిత మంచినీటి సౌకర్యం లేదు,  నీళ్ల ట్యాంకర్లతో  అపరిశుభ్రంగా  వచ్చే నీళ్లను  తాగి  విద్యార్థులు రోగాల బారిన పడుతున్నారు.

కొన్ని  గురుకులాల్లో  కేవలం 400 మంది విద్యార్థుల కోసం కట్టిన అద్దె భవనంలో 700 మంది విద్యార్థుల వరకు అనుమతిస్తున్నారు.  నాసి రకమైన  భోజనంలో  పురుగులు రావడం,  నీళ్లచారు, పలచని మజ్జిగ పెడుతుంటే  ప్రశ్నించలేని విద్యార్థులు గత్యంతరం లేక  తిని అనారోగ్యానికి గురవుతున్నారు. కొంతమంది  కోలుకోలేక చివరకు ప్రాణాలు కోల్పోతున్నారు. గురుకులాల్లో ఇంతటి దారుణ ఘటనలు జరుగుతున్నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శులు, ఉన్నతాధికారులు ఏం చేస్తున్నట్లు? 

ఎస్సీ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎస్టీ  సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిధులు దారి మళ్ళింపు

కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వ నిధులు  ఎస్సీ,  ఎస్టీల  అభివృద్ధి  కోసం  బడ్జెట్​లో  కేటాయించిన ఎస్సీ, ఎస్టీ  సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
ప్లాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  నిధులను దారి మళ్లించారని కాగ్ ఇటీవలే ఒక నివేదికలో వెల్లడించింది. ఎస్సీ అభివృద్ధి నిధుల్లో 58 శాతం, ఎస్టీ నిధుల్లో 38 శాతం వినియోగించలేదని తెలిపింది.  ఖర్చు అయిన ఎస్సీ,  ఎస్టీ  ప్రత్యేక  అభివృద్ధి  నిధులను సైతం గత  కేసీఆర్ సర్కార్  దారి మళ్లించినట్లు కాగ్ రిపోర్టులో  పేర్కొన్నారు.

పాలకులకు  ఎస్సీ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,  ఎస్టీ  సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిధుల దారి మళ్ళింపు మీద ఉన్న  ప్రేమ.. ఎస్సీ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎస్టీల సంక్షేమం,  గురుకులాల అభివృద్ధి మీద లేదని స్పష్టంగా అర్థమౌతోంది. గత పాలకుల నిర్లక్ష్యం, అంతులేని అవినీతితో ఎస్సీ, ఎస్టీ  సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  నిధులను ఎక్కడ ఖర్చు చేశారో?  ఎవరి జేబులు నిండాయో తెలియదు.

సీఎం  సమీక్షించాలి.. సమస్యలు పరిష్కరించాలి 

ఎస్సీ, గిరిజన సంక్షేమ శాఖలను తనవద్దే ఉంచుకున్న సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి అన్ని సంక్షేమ గురుకులాల కార్యదర్శులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించాలి.  ఏడాది కాలంలో  విద్యార్థుల మరణాలతోపాటు, ఫుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాయిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో  అస్వస్థతకు గురైన ఘటనలకు కారణాలు కనుగొనాలి.  క్షేత్రస్థాయిలో  నెలకొన్న  సమస్యలను  తెలుసుకొని  తక్షణమే  పరిష్కరించాలి. చాలా ఏండ్ల తర్వాత  గురుకులాల్లో  మార్కెట్ ధరలకు అనుగుణంగా విద్యార్థులకు  సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి  ప్రత్యేక చొరవ తీసుకొని గురుకులాల్లో  డైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చార్జీలు పెంచారు. సంతోషమే కానీ,  అదే సమయంలో  గురుకులాల వసతి గృహాలకు  ప్రహరీ గోడలు ఏర్పాటుకు శ్రీకారం చుట్టాలి.

ప్రతి గురుకులంలో రక్షిత మంచినీటిని సరఫరా కోసం ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేయాలి.  స్నానపు గదులు, మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచేలా ఆదేశించాలి. విద్యార్థుల  ఆత్మహత్యల నివారణకు మానసిక ఆరోగ్య నిపుణులను నియమించాలి.  బాలికల వ్యక్తిగత భద్రతకు భంగం కలగకుండా బాలికల గురుకులాల ప్రహరీ గోడలకు సోలార్ పవర్ ఫెన్సింగ్ వేయాలి.  సీసీ  కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయాలి.  సిబ్బంది విషయంలో ప్రవర్తనా నియమావళిని రూపొందించి కఠినంగా అమలుచేయాలి.  గురుకులాల్లో దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి స్థానిక ఎమ్మెల్యే, ఎంపీపి, మున్సిపల్ చైర్మన్, ప్రిన్సిపాల్, విద్యాధికారి, వైద్యాధికారి, తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్, సంక్షేమశాఖ అధికారి, ఎస్సై, సామాజిక మహిళా కార్యకర్తలు, న్యాయవాదులతో కూడిన సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలి.

- డా.చెట్టుపల్లి మల్లికార్జున్,
పొలిటికల్ ఎనలిస్ట్