
కొండాపూర్ శ్రీరామ్ నగర్ లో ఫుట్ పాత్ ఆక్రమణలపై శేరిలింగంపల్లి టౌన్ ప్లానింగ్ అధికారులు కొరడా ఝులిపించారు. ఫుట్‌పాత్, రోడ్లు ఆక్రమించి ఇష్టానుసారంగా అక్రమంగా వేసిన షెడ్లతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటంతో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించే దిశగా శేరిలింగంపల్లి టౌన్ ప్లానింగ్ అధికారులు చొరవ చూపారు. కాలనీలో ప్రధాన రహదారికి ఇరువైపులా రోడ్ ను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. రోడ్డుకు ఇరువైపులా వెలసిన అక్రమ నిర్మాణాలను భారీ పోలీస్ బందోబస్తు మధ్య జేసీబీలతో తొలగించారు.
రెండు రోజుల క్రితం మున్సిపల్ కార్యాలయంలో స్థానికులు ఆందోళన నిర్వహించారు. రోడ్లను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో భారీగా ట్రాఫిక్ జాం అవుతుంది. దీంతో భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఫుట్ పాత్ జేసీబీలతో ఆక్రమణలను తొలగించారు. రోడ్లు, ఫుట్‌పాత్‌లను ఆక్రమించి నిర్మాణాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని శేరిలింగంపల్లి టౌన్ ప్లానింగ్ అధికారులు హెచ్చరించారు.