ఈ మందు సీసా ఓపెన్ చేస్తే మందుబాబులకు షాక్

ఈ మందు సీసా ఓపెన్ చేస్తే మందుబాబులకు షాక్

నకిలీ విదేశీ మద్యం విక్రయిస్తున్న నలుగురు సభ్యుల ముఠాను శేరిలింగంపల్లి ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. మాదాపూర్ కావురిహిల్స్లో విదేశీ నకిలీ మద్యం విక్రయిస్తుండగా టాస్క్ఫోర్స్ టీంతో కలిసి  పట్టుకున్నారు. నిందితులు నగరంలోని పలు బార్లలో పనిచేస్తున్న యువకులుగా గుర్తించారు. బార్లలోని ఖాళీ గ్లెన్ఫి డిచ్ బాటిల్స్ తీసుకుని అందులో మద్యాన్ని నింపి విదేశీ మద్యంగా విక్రయిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఒక్కో బాటిల్ మూడు వేలకు విక్రయిస్తున్నట్లుగా అధికారులు వెల్లడించారు.  

బీహార్, ఒరిస్సాలకు చెందిన శాంతన్ కుమార్, సితంబర్, సంతోష్ కుమార్, జ్ఞాన రంజన్ నాయక్ లను అరెస్ట్ చేశారు. పట్టుబడ్డ నిందితుల వద్ద నుండి 16 నకిలీ మద్యం బాటిల్స్, విదేశీ ఖాళీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.