బొలెరో వాహనం బోల్తా

బొలెరో వాహనం బోల్తా
  •     కూలీలకు తీవ్రగాయాలు

 కోడేరు,వెలుగు: నాగర్ కర్నూల్  జిల్లా కోడేరు మండలం జనుంపల్లి రోడ్​ పీఏసీఎస్​ గోదామ్​ వద్ద శనివారం 45 మంది కూలీలతో వెళ్తున్న బొలెరో వెహికల్​ బోల్తాపడి పలువురికి తీవ్రగాయాలయ్యాయి. తాడూరు మండలంలో పత్తి చేలల్లో కలుపు తీసేందుకు కోడేరు మండలానికి చెందిన 20 మంది, పెద్దకొత్తపల్లి మండలం మహాసముద్రం గ్రామానికి చెందిన మరో 25 మంది కూలీలను తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 

వేగంగా వెళ్తున్న వాహనం అదుపుతప్పి బోల్తా పడడంతో కోడేరు గ్రామానికి చెందిన అరిగెల చిట్టెమ్మ, మహాసముద్రం గ్రామానికి చెందిన పెళ్లె బాలమ్మ, చెన్నమ్మ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు మండల కేంద్రంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి నాగర్ కర్నూల్  జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు డ్రైవర్​ బద్దుల మహేశ్​పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ కురుమూర్తి తెలిపారు.
 
చెట్టును ఢీకొన్న స్కూల్​ బస్సు

వనపర్తి: పట్టణ శివారులోని రాజనగరం రామకృష్ణేశ్వర ఆలయం వద్ద జిల్లా కేంద్రంలోని అనూస్  స్కూల్​ బస్​ చెట్టును ఢీకొనడంతో నలుగురు స్టూడెంట్లు గాయపడ్డారు. 20 మంది స్కూడెంట్లతో అచ్యుతాపూరు గ్రామం వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అచ్యుతాపూరు గ్రామానికి చెందిన శ్రీవల్లి, కారుణ్య, జగత్​పల్లికి చెందిన ఆందన్, మహాన్వికి గాయాలయ్యాయి. గాయపడిన స్టూడెంట్లను జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్​ హాస్పిటల్​కు తరలించారు. ఎస్ఐ జలంధర్​రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.