![సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్](https://static.v6velugu.com/uploads/2025/02/serious-road-accident-in-siddipet-district-two-dead-on-the-spot_hRSzsrqwiu.jpg)
సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రజ్ఞాపూర్ రింగ్ రోడ్డు పెట్రోల్ దగ్గర లారీని కారు వెనక నుంచి ఢీకొట్టింది. కారు ముందు భాగం పూర్తిగా లారీ కిందికు చొచ్చుకుపోయి నుజ్జునుజ్జు అయ్యింది. దీంతో కారులోని ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి గాయపడ్డాడు. ప్రమాదానికి గురైన కారు.. గోదావరి ఖని నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని చికిత్స నిమిత్తం.. గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ ఘనటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.