ఘోర రోడ్డు ప్రమాదం.. నదిలో కొట్టుకపోయిన రెండు బస్సులు

ఘోర రోడ్డు ప్రమాదం.. నదిలో కొట్టుకపోయిన రెండు బస్సులు

నేపాల్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సెంట్రల్ నేపాల్‌లోని మదన్-ఆష్రిత్ హైవే పై తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో రెండు బస్సులు  త్రిశూలి నదిలో కొట్టుకుపోయాయి. విషయం తెలుసుకున్న అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఈ ప్రమాదం లో సుమారు 30 మంది తప్పిపోయినట్టు తెలుస్తుంది. 

రెండు బస్సుల్లో మొత్తం 63 మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు తెలిపారు.  చిత్వాన్ జిల్లా చీఫ్ ఆఫీసర్ ఇంద్రదేవ్ యాదవ్ మాట్లాడుతూ ఖాట్మండు నుండి బయలుదేరిన ఏంజెల్ బస్సు, గణపతి డీలక్స్ కొండచరియలు విరిగిపడి నదిలో కొట్టుకుపోయాయన్నారు.  ఖాట్మండుకు వెళుతున్న బస్సులో 24 మంది, మరో బస్సులో 41 మంది ప్రయాణిస్తున్నారని చెప్పారు.

ALSO READ : తిరుమలలో నడుస్తూ వెళుతున్న భక్తురాలిపై విరిగిపడ్డ చెట్టు కొమ్మ..

 నారాయణ్‌గఢ్-ముగ్లిన్ రోడ్ సెక్షన్‌లో కొండచరియలు విరిగిపడటంతో బస్సు కొట్టుకుపోయిందన్నారు. సుమారు ఐదు డజన్ల మంది ప్రయాణికులు తప్పిపోయారని తెలుస్తుందన్నారు. త్రిశూలి నది ఉప్పొంగి ప్రవహించడంతో రెస్క్యూ టీంకి ఇబ్బంది కలుగుతుందన్నారు అధికారులు.