కుత్బుల్లాపూర్ పరిధిలోని జీడిమెట్ల పారిశ్రామిక వాడలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కంపెనీలో పని చేసేందుకు వచ్చి కవలలు మృతి చెందారు. వివరాల ప్రకారం.. జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని ఓ కంపెనీలో రెనోవేషన్ పనులు నడుస్తున్నాయి. అన్నదమ్ములు (కవలలు) రాము, లక్ష్మణ్ కంపెనీలో ఫ్యాబ్రికేషన్ వర్క్ చేస్తున్నారు. ప్రమాదవశాత్తూ లక్ష్మణ్ కెమికల్ పంపులో పడిపోయాడు. గమనించిన రామ్ వెంటనే తమ్ముడిని కాపాడేందుకు ప్రయత్నం చేశాడు. తమ్ముడిని రక్షించే ప్రయత్నంలో రామ్ కూడా కెమికల్ సంపులో పడిపోవడంతో ఇద్దరూ మరణించారు.
ALSO READ | మెదక్లో ఘోర ప్రమాదం.. కారు వాగులో పడి ఏడుగురు మృతి
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు ఆరా తీశారు. షాపూర్ నగర్లోని రామ్ రాజ్ హాస్పిటల్కు మృతదేహాలు తరలించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని జీడీమెట్ల పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అన్నదమ్ములు ఒకేసారి మరణించడంతో మృతుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.