గెస్ట్ టీచర్లు, ఫ్యాకల్టీ కోసం దరఖాస్తుల ఆహ్వానం

గెస్ట్ టీచర్లు, ఫ్యాకల్టీ కోసం దరఖాస్తుల ఆహ్వానం

మంచిర్యాల, వెలుగు: మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ వెల్ఫేర్​రెసిడెన్షియల్​ స్కూళ్లు, కాలేజీల్లో గెస్ట్​ టీచర్లు, ఫ్యాకల్టీ నియామకాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కన్వీనర్ సేరు శ్రీధర్ తెలిపారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్​​, మాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, సోషల్ సబ్జెక్టుల్లో ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో పీజీ, బీఈడీ పూర్తి చేసి ఉండాలన్నారు. 

డెమో, ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్స్​ జరుగుతాయని తెలిపారు. ఈ నెల 28 లోపు దగ్గరలోని స్కూళ్లలో అప్లై చేసుకోవాలని సూచించారు. 30న ఉదయం 8.30 నుంచి సాయంత్రం 4.30 వరకు గుడిపేటలోని మహాత్మా జ్యోతిబా ఫూలే బాయ్స్​రెసిడెన్షియల్​ స్కూల్​లో డెమో, ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. వివరాలకు 7993456620 నంబర్​లో సంప్రదించాలన్నారు.  

డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లకు....  

ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమ్రం భీమ్​ఆసిఫాబాద్ జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు కానున్న మహాత్మా జ్యోతిబా ఫూలే డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం ఇంటర్​పూర్తి చేసిన స్టూడెంట్ల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్టు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రీజినల్ కో ఆర్డినేటర్ గోపీచంద్, మంచిర్యాల జిల్లా కన్వీనర్ సేరు శ్రీధర్ తెలిపారు. ఆన్​లైన్​లో www.mjptbcwreis.telangana.gov.in లో అప్లై చేసుకోవాలన్నారు.