సింగరేణి ఉద్యోగులకు ఎస్ఎల్​పీ ప్రమోషన్లు

కోల్​బెల్ట్, వెలుగు: మందమర్రి ఏరియాలోని బొగ్గు గనులు, డిపార్ట్​మెంట్లలో పనిచేస్తున్న ఉద్యోగులకు సింగరేణి యాజమాన్యం సర్వీస్​ లింక్డ్​ ప్రమోషన్లు(ఎస్​ఎల్​పీ) కల్పించింది. బుధవారం మందమర్రి జీఎం ఆఫీస్​లో​ఉద్యోగులకు జీఎం మనోహర్ ప్రమోషన్​ఆర్డర్స్​ అందించారు. జీఎం మాట్లాడుతూ.. క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తున్న ప్రతి ఉద్యోగిని సంస్థ గుర్తిస్తుందన్నారు. ఏరియా ఏస్వోటుజీఎం ఎ.రాజేశ్వర్​రెడ్డి, పర్సనల్​ మేనేజర్​ శ్యాంసుందర్, డివైపీఎం సత్యబోస్, ఓఎస్​ రాజలింగు తదితరులు పాల్గొన్నారు.​