వాగు ఉధృతికి కొట్టుకుపోయిన సర్వీస్ రోడ్డు 

కూసుమంచి, వెలుగు:  కూసుమంచి మండలంలో  మంగళితండా, ఈశ్వరమాధారం, గ్రామాల మధ్య వాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జి దగ్గర సర్వీస్ రోడ్డు ఇటీవల వర్షాలకు  కొట్టుకుపోయింది.  గతేడాది కాలంగా రూ. 5.50  కోట్ల అంచనా వ్యయంతో  బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్నా కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో సర్వీస్ రోడ్డు లేక రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.   పైపులతో  వేసి మట్టి పోయడంతో వాగు ఉదృతికి తట్టుకోలేక రోడ్డుపై ఉన్న మట్టి  కొట్టుకుపోయింది.

నాయకన్​గూడెం నుంచి రాజుపేటకు రావాలన్న, వాగు దాటలేక కూసుమంచి గట్టుసింగారం పెరికసింగారం మీదుగా సుమారు 25 కిలో మీటర్ల చుట్టూ తిరిగి రాజుపేట గ్రామానికి ప్రజలు రాకపోకలను సాగిస్తున్నారు. కాంట్రాక్టర్ సర్వీస్ రోడ్డును పునరుద్ధరించాలని కోరుతున్నారు.