బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో పోలీసుల సేవలు వెలకట్టలేనివి : ప్రయాకర్ రావు

బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో పోలీసుల సేవలు  వెలకట్టలేనివి : ప్రయాకర్ రావు

రాజన్న సిరిసిల్ల, వెలుగు :  బ్లడ్ డోనేషన్ క్యాంప్  నిర్వహణలో  సిరిసిల్ల పోలీసులు పాత్ర వెలకట్టలేనిదని  ఇండియన్ రెడ్ క్రాస్ సోసైటీ జల్లా  వైస్ ప్రెసిడెంట్ ప్రయాకరావు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.  ప్రపంచ రక్త దాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని    సోసైటీ ఆధ్వర్యంలో జిల్లాలో పోలీసులు  బ్లడ్ డోనేషన్ క్యాంప్ లు నిర్వహించగా  676 యూనిట్ల బ్లడ్ సేకరించినట్టు తెలిపారు.  బ్లడ్ సేకరణలో  రాజన్నసిరిసిల్ల జిల్లా స్టేట్  ఫస్ట్ ప్లేస్ లో నిలిచిందన్నారు.  

రెడ్ క్రాస్ సోసైటీ 20 వ వార్షికోత్సం సందర్భంగా హైదరాబాద్​లోని రాజ్ భవన్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ రావు చేతుల మీదుగా మెమెంటో అందుకున్నామన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ ను శనివారం రెడ్ క్రాస్ సోసైటీ మెంబర్స్ కలిసి అభినందించారు. ఈ కార్యక్రమంలో  ఆయన వెంటరెడ్ క్రాస్ సోసైటీ మెంబర్స్   వేణు కుమార్ , శివప్రసాద్, సంగీతం శ్రీనివాస్, భాస్కర్ పాల్గోన్నారు.