కామారెడ్డిటౌన్, వెలుగు : సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడంలో జిల్లా రిటైర్డ్ ఎంప్లాయీస్సేవలు అభినందనీయమని కామారెడ్డి కలెక్టర్ఆశిష్ సంగ్వాన్ అన్నారు. పదో తరగతిలో 10 జీపీఏ సాధించిన 10 మంది విద్యార్థులకు రిటైర్డ్ ఎంప్లాయీస్ సంఘం ఆధ్వర్యంలో శనివారం ఒక్కోక్కరికి రూ.5 వేల నగదు పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఉద్యోగులుగా రిటైర్డ్ అయినప్పటికీ సామాజిక సేవలు నిర్వహిస్తున్నారన్నారు.
కార్యక్రమంలో డీఈవో రాజు, యూనియన్ జిల్లా ప్రెసిడెంట్ నిట్టు విఠల్‌రావు, సెక్రటరీ గంగాగౌడ్, ట్రెజరర్ మల్లేశం, ప్రతినిధులు ఉపేందర్, విశ్వనాథం సలావుద్దీన్, శ్యాంరావు, నాగగౌడ్, అర్జున్‌రావు, నర్సయ్య, చక్రపాణి, బాల్‌రెడ్డి, నారాయన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.