న్యూఢిల్లీ: ఇన్‌ఫ్లేషన్ ఒత్తిళ్లు తగ్గడంతో పాటు, కొత్త ఆర్డర్లు రావడంతో కిందటి నెలలో సర్వీసెస్ సెక్టార్ పనితీరు మెరుగుపడింది. హెచ్‌ఎస్‌బీసీ ప్రతీ నెల విడుదల చేసే పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) డిసెంబర్‌లో నాలుగు నెలల గరిష్టమైన 59.3 కి చేరుకుంది.
అంతకు ముందు నెలలో 58.4 గా నమోదైంది. పీఎంఐ 50 కి పైన రికార్డ్ అయితే సంబంధిత సెక్టార్ విస్తరిస్తున్నట్టు. హెచ్‌ఎస్‌బీసీ సర్వే ప్రకారం, సర్వీసెస్ సెక్టార్‌లో డిమాండ్ బాగుంది. కొత్త బిజినెస్ ఆర్డర్లు వస్తున్నాయి. దీంతో కంపెనీల ప్రొడక్టివిటీ పెరుగుతోంది. నియామకాలు ఊపందుకున్నాయి. మరోవైపు ఇన్‌ఫ్లేషన్ ఒత్తిళ్లు తగ్గడం కలిసొస్తోంది. కాగా, మాన్యుఫాక్చరింగ్ సెక్టార్ పనితీరును కొలిచే పీఎంఐ కిందటి నెలలో 12 నెలల కనిష్టానికి పడిపోయిన విషయం తెలిసిందే.