10 నెలల కనిష్టానికి సేవారంగం

10 నెలల కనిష్టానికి సేవారంగం

న్యూఢిల్లీ: కొత్త వ్యాపారాలు, అంతర్జాతీయ విక్రయాలు,  ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రోత్​ నెమ్మదించడంతో సెప్టెంబరులో మనదేశ సేవల రంగ కార్యకలాపాలు 10 నెలల కనిష్టానికి పడిపోయాయని నెలవారీ సర్వే శుక్రవారం తెలిపింది. హెచ్​ఎస్​బీసీ ఇండియా సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ ఆగస్టులో 60.9 నుంచి సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 57.7కి పడిపోయింది.  వృద్ధి వేగం నవంబర్ 2023 నుంచి నెమ్మదిగా ఉందని సర్వే తెలిపింది.

  "సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సేవల రంగం నెమ్మదిగా విస్తరించిందని భారతదేశ సేవల పీఎంఐ డేటా చూపించింది. హెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ 2024లో మొదటిసారిగా 60కి పడిపోయింది. సెప్టెంబరులో 57.7కి దిగజారింది”అని హెచ్​ఎస్​బీసీలో చీఫ్ ఇండియా ఎకనామిస్ట్ ప్రంజుల్ భండారీ అన్నారు.   విపరీతమైన పోటీ, ఖర్చులు,  వినియోగదారుల ప్రాధాన్యాల్లో మార్పులు ( ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ సేవలకు మారడం),  కొత్త ఎగుమతి ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో తక్కువ పెరుగుదల కారణంగా వృద్ధికి ఆటంకాలు ఎదురయ్యాయి.