
న్యూఢిల్లీ: ఇండియా సర్వీసెస్ సెక్టార్ కిందటి నెలలో పుంజుకుంది. సర్వీసెస్ సెక్టార్ పనితీరును కొలిచే హెచ్‌ఎస్‌బీసీ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) ఈ ఏడాది సెప్టెంబర్‌లో పది నెలల కనిష్టమైన 57.7 కి పడిపోగా, అక్టోబర్‌లో 58.5 కి పెరిగింది. డిమాండ్ బాగుందని, వ్యాపార కార్యకలాపాలు పెరిగాయని హెచ్‌ఎస్‌బీసీ ఎకనామిస్ట్ ప్రంజుల్ భండారి అన్నారు.