Hair Beauty: జుట్టు నల్లగా ...మెరుస్తూ.. పొడుగ్గా ఉండాలంటే .. బెస్ట్​ ఆయిల్​ ఇదే...

Hair  Beauty:  జుట్టు నల్లగా ...మెరుస్తూ.. పొడుగ్గా ఉండాలంటే .. బెస్ట్​ ఆయిల్​ ఇదే...

 జుట్టు నిగ నిగ లాడుతూ.. నల్లగా...ఒత్తుగా ఉండాలని అనేక రకాలైన ఆయిల్స్​.. వివిధ రకాలైన చిట్కాలు వాడుతుంటారు.  కాని హెయిర్​ అందంగా.. మృదువుగా ఉండాలంటే నువ్వుల నూనె బెస్ట్​ అంటున్నారు  నిపుణులు. నువ్వుల నూనెను తలకు బాగా పట్టిస్తే జుట్టు పెరగడమే కాకుండా.. హెయిర్​ సెల్స్​ యాక్టివ్​ గా ఉండి గ్రోత్​ను కలిగిఉంటాయి. చాలా వరకు హెయిర్​ ప్రోబ్లమ్స్​ చుండ్రు వల్లే  వస్తాయి. 

నువ్వులనూనెలో విటమిన్లు.. యాంటీ ఆక్సిడెంట్లు.. ఎసెన్షియల్​ఫ్యాటీ యాసిడ్​ లు నువ్వుల నూనెలో  పుష్కలంగా ఉన్నాయి.  ఇవి జుట్టు పెరుగుదలకు.. మృదువుగా ఉండేందుకు ఎంతో ఉపయోగపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.   నువ్వులనూనెను తలకు పట్టిస్తే హెయిర్​ చాలా అందంగా .. పొడుగ్గా పెరుగుతుంది. 

నువ్వులనూనె తలకు రాసుకుంటే.. రక్తప్రసరణ ( Blood Circulation) క్రమ బద్దీకరించుటకు సహాయ పడుతుంది. జుట్టు కుదుళ్లకు బలాన్ని చేకూర్చడమే కాకుండా నిగనిగ లాడే విధంగా ఉంచేందుకు ఎంతో ఉపయోగపడుతుంది.  నువ్వుల నూనెను తలకు రాసుకోవడం వలన  హెయిర్ ఫోలికల్స్  అందంగా...ఉండి..  జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది. నువ్వుల నూనెలో మాయిశ్చరైజింగ్ లక్షణాలు ఉన్నాయి.  ఇవి జుట్టును  పొడిబారకుండా  ఉంచుతాయి. 

ALSO READ | Good Health : టీనేజ్ అమ్మాయిలు వీటిని కచ్చితంగా తినాలి.. లేకపోతే హార్మోన్లలో మార్పులు వస్తాయి..!

నువ్వుల నూనెతో తలను  మసాజ్ చేయడం వల్ల  చుండ్రు ..దురద తగ్గుతుంది. ఇంకా తలలో ఉండే క్రిములు నశిస్తాయి.  జుట్టు మొదట్లో బలంగా ఉంచేందుకు నువ్వులనూనె ఎంతో ఉపయోగకారిగా ఉంటుంది.  మిగతా ఆయిల్స్​ తో పోలిస్తే జుట్టు నువ్వులనూనె తలను కూల్​ గా ఉంచుతుంది.  వేడి వలన జుట్టు దెబ్బతినకుండా ఎంతో హాయిగా ఉంటుంది.  జుట్టుకు రక్షణగా ఉండటమే కాకుండా హానికరమైన UV కిరణాల నుండి కాపాడి జుట్టు రాలకుండా ఎంతో ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. 

నువ్వుల నూనెలో యాంటీమైక్రోబయల్ లక్షణాలు చుండ్రును తగ్గిస్తాయి.  పడుకునే ముందు తలపై నువ్వుల నూనెతో మసాజ్ చేయండి. ఇది చుండ్రును తగ్గిస్తుంది. నువ్వుల నూనెను తలకు మసాజ్ చేయడం వల్ల జుట్టు అకాల నెరసిపోకుండా ఉంటుంది. ఎండ నుంచి జుట్టును కాపాడుతుంది. కాలుష్యం నుంచి జుట్టును కాపాడుతుంది. 

డ్యామేజ్ అయిన వెంట్రుకలను పునరుద్ధరించే శక్తి నువ్వుల  నూనెకు ఉంది. అయితే, ఈ నూనెతో మసాజ్ చేస్తే, ఇది తలలో చొచ్చుకొనిపోయి జుట్టు కుదుళ్లకు పోషణనిచ్చి, ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. జుట్టు రాలడాన్ని నివారిస్తుంది నేటి తరంలో జుట్టు రాలడానికి ఒత్తిడి ప్రధాన కారణం. నువ్వుల నూనెలోని ఎమోలియెంట్ గుణాలు జుట్టు రాలడాన్ని నివారిస్తాయి.  యాంటీ బాక్టీరియల్ లక్షణాల వల్ల, ఇది బ్యాక్టీరియా ...  ఫంగల్ ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది.