బీజేపీలో చేరిన ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

రాజ్యసభలో పోల్స్ లో క్రాస్ ఓటు వేసిన ఆరుగురు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు బీజేపీలో శనివారం (మార్చి 23) చేరారు. వీరితో పాటు ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు కూడా కేంద్రమంత్రి అనురాగ్ సింగ్ ఠాగూర్  సమక్షంలో ఖాషాయం కండువా కప్పుకున్నారు. ఆరుగురు రెబల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సుధీర్ శర్మ, రవిఠాకూర్, రాజిందర్ రాణా, ఇందర్ దత్  లఖన్ పాన్, చైతన్య శర్మ, దేవిందర్ కుమార్ భుట్టోలపై ఫిబ్రవరి 29 న అనర్హత వేటు పడింది. దీంతో ఎన్నికల సంఘం ఆయా నియోజకవర్గాలకు ఉప ఎన్నికలను ప్రకటించింది. 

ఈ తొమ్మిది మంది ఎమ్మెల్యేల మద్దతు కారణంగా రాష్ట్రంలోని ఏకైక రాజ్యసభ  ఎన్నికల్లో  బీజేపీ విజయం సాధించడంతో ముఖ్యమంత్రి సుఖ్ విందర్ సింగ్ సుఖూ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఫిబ్రవరి నెలల సంక్షోభంలోపడింది. సుఖూ ధైర్యసాహసాలు ప్రదర్శిస్తున్నటికీ అతని ప్రభుత్వానికి తక్షణ ముప్పు లేనట్టు కనిపించినా.. ఆ స్థానాలకు ఉపఎన్నికల విజయాలతో, మరికొంత మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలను లాక్కోవడం ద్వారా సుఖూ సర్కార్ ను దించాలని చూస్తోంది. 

ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంతో ఇప్పుడు 62 మంది  సభ్యులన్న అసెంబ్లీలో అధికార పార్టీ బలం 39 నుంచి 33 కి పడిపోయింది.అసలు బలం 68.బీజేపీకి 25 మంది సభ్యులున్నారు.  బలపరీక్షలో టై అయినప్పుడు మాత్రమే ఓటు వేయగల స్పీకర్ కాంగ్రెస్ కు అనుబంధంగా ఉన్నారు.ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో అసెంబ్లీ బలం మరింత తగ్గింది.